Asianet News TeluguAsianet News Telugu

స్నేహంతో ఎలాంటి స‌మ‌స్య‌నైనా ప‌రిష్క‌రించుకోవ‌చ్చు - బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనా

స్నేహం ఎలాంటి సమస్యలకైనా పరిష్కారాన్ని చూపుతుందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. మన దేశంలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్న హసీనా సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆమెకు స్వాగతం పలికారు. 

Friendship can solve any problem - Bangladesh Prime Minister Sheikh Hasina
Author
First Published Sep 6, 2022, 1:15 PM IST

స్నేహంతోనే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం సోమ‌వారం ఆమె భార‌త్ కు చేరుకున్నారు. న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో హసీనాకు ప్రధాని నరేంద్ర మోదీ ఘనస్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆమె మాట్లాడారు. 

దారుణం.. కూతురి కంటే బాగా చదువుతున్నాడని.. విద్యార్థిపై విషప్రయోగం.. ఓ తల్లి క్రూరత్వం...

మోడీతో తన చర్చలు ఆయా దేశాల్లోని ప్రజల స్థితిగతులను మెరుగు ప‌రుస్తాయ‌ని, పేదరిక నిర్మూలన, ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారిస్తాయని హ‌సీనా చెప్పారు. ‘‘ మా ప్రధాన లక్ష్యం ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం, మన ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం. స్నేహంతో మనం ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. కాబట్టి మేము ఎప్పుడూ అలాగే చేస్తాం ’’ అని ఆమె తెలిపారు. 

నిన్న మ‌ధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న హ‌సీనా మహాత్మా గాంధీ స్మారక స్థూపం అయిన రాజ్‌ఘాట్ వద్ద ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించారు. నేడు (మంగళవారం) మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కాగా.. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం సాయంత్రం హసీనాను కలిశారు. అలాగే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కూడా త‌రువాత బంగ్లాదేశ్ ప్రధానిని కూడా కలిశారు.

హసీనా తన బసలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్‌లను కూడా క‌లుసుకున్నారు. హసీనా సోమవారం దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ఔలియా దర్గాను కూడా సందర్శించారు. గురువారం అజ్మీర్‌షరీఫ్‌కు వెళ్లనున్నారు.

కాగా.. భారత్ సందర్శన సందర్భంగా ఇటీవ‌ల మీడియాతో మాట్లాడుతూ.. భారత్ స్నేహాన్ని కొనియాడారు. బంగ్లాదేశ్, భార‌త్ దేశాల మధ్య సన్నిహిత సహకారాన్ని షేక్ హ‌సీనా నొక్కి చెప్పారు. రెండు దేశాల మ‌ధ్య విభేదాలు ఉండ‌వ‌చ్చ‌ని కానీ వాటిని చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించాల‌ని చెప్పారు. ఇప్ప‌టికే అనేక ప్రాంతాల్లో భారత్, బంగ్లాదేశ్ లు ఆ ప‌ని చేశాయ‌ని తెలిపారు. ‘‘ రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరిగిన ఈ యుద్ధ సమయంలో మా విద్యార్థుల్లో చాలా మంది చిక్కుకుపోయారు. వారు ఆశ్రయం కోసం పోలాండ్ కు తీసుకొచ్చినందుకు నేను ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. కానీ మీరు (ప్రధాని మోడీ) మీ విద్యార్థులను తరలించినప్పుడు మా విద్యార్థులను కూడా ఇంటికి తీసుకువచ్చారు. మీరు నిజంగా, స్పష్టంగా స్నేహపూర్వక సంజ్ఞలను చూపించారు. ఈ చొరవకు ప్రధానికి ధన్యవాదాలు ’’ అని హసీనా పేర్కొన్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌: దేశంలో 35 చోట్ల కొనసాగుతున్న ఈడీ సోదాలు..

ప్ర‌స్తుతం బంగ్లాదేశ్ దక్షిణాసియాలో భారతదేశం అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ద్వైపాక్షిక వాణిజ్యం గత ఐదేళ్లలో 9 బిలియన్ డాలర్ల నుండి 18 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎగుమతులు 9.69 బిలియన్ డాలర్ల నుంచి 2021-22 నాటికి 16.15 బిలియన్ డాలర్లకు పెరిగింది. 66 శాతం వృద్ధిని నమోదు చేయడంతో ఇది భారతదేశానికి నాలుగో అతి పెద్ద ఎగుమతి గమ్యస్థానంగా మారింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios