ప్రముఖ గాయకుడు కేకే మ‌ర‌ణం పట్ల దేశం మొత్తం ఒక్క సారిగా ద్రిగ్భాంతికి గురయ్యింది. హిందీతో పాటు దాదాపు అన్ని భాషల్లో అద్భుతమైన పాటలు పాడిన కేకే అకాల మృతి సంగీత ప్రియుల‌ను శోక సంద్రంలో ముంచేసింది. ఆయ‌న మృతి ప‌ట్ల ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. 

బాలీవుడ్‌లోని బహుముఖ గాయకుడిగా మంచి పేరున్న కేకే మ‌ర‌ణం సంగీత ప్రియుల‌కు తీర‌ని లోటు. కోల్ క‌త్తాలో స్టేజ్ పై ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చి హోటల్ కు వెళ్లి త‌రువాత ఒక్క సారిగా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. కొంత స‌మ‌యంలోనే ఆయ‌న చ‌నిపోయారు. దీంతో ఆయ‌న ఈ సంగీత ప్ర‌పంచానికి వీడ్కోలు ప‌లికి వెళ్లిపోయారు. కేకే చ‌నిపోయినా పాట‌ల రూపంలో ఆయ‌న ఎప్పుడూ బ‌తికే ఉంటారు. 

Singer KK : ప్రముఖ గాయకుడు కేకే మృతి..

కేకే రొమాంటిక్ పాటల నుంచి ఉల్లాసమైన పాటల వ‌ర‌కు అన్ని రకాల పాట‌లు పాడారు. ప్ర‌తీ పాట‌పై ఆయ‌న అంకిత భావంతో ప‌ని చేశారు. త‌న గొంతు నుంచి వెలువ‌డిన ప్ర‌తీ పాట‌కు ఆయ‌న ఒక గుర్తింపు తీసుకొచ్చారు. మిలియన్ల మంది భార‌త సంగీత ప్రియుల హృదయాలలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. 53 ఏళ్ల వ‌య‌స్సులో అంద‌రి నుంచి ఆయ‌న దూరం అయ్యారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న గురించి ఎవ‌రికీ తెలియ‌ని ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకుందాం. 

Singer KK : బాలీవుడ్ సింగ‌ర్ కేకే మృతి ప‌ట్ల ప్ర‌ధాని, కేంద్ర హోం మంత్రి సంతాపం

బాలీవుడ్ తో పాటు అనేక భాష‌ల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సింగ‌ర్ సంగీతంలో ఎలాంటి శిక్ష‌ణను పొందలేదు. KK సంగీత ప్రయాణం ఢిల్లీలోని మౌంట్ సెయింట్ మేరీ స్కూల్‌లో చదువుతున్నప్పుడు ప్రారంభ‌మైంది. తన తండ్రి చిన్న టేప్ రికార్డర్‌లో రికార్డ్ చేసే తల్లి మలయాళీ పాటలను వినేవారు. చదువుకునే రోజుల్లో తనకు ఇష్టమైన పాటలు వింటూ హమ్ చేసేవాడు. దక్షిణ ఢిల్లీలోని గ్రీన్ పార్క్‌లో పుట్టి పెరిగిన KK షోలేలోని ‘మెహబూబా’ పాటను స్థానికులు తరచుగా పాడాల‌ని కోర‌డంతో వాటిని పాడేవారు. అయితే 2వ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్లో స్టేజ్ పెర్ఫార్మెన్స్ సాంగ్ ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల‌ను పొంద‌డంతో కేకే సంగీతాన్ని సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టాడు. 

కేకే బాలీవుడ్ పాటలే కాకుండా దాదాపు 3000 జింగిల్స్‌కు తన గాత్రాన్ని అందించాడు. వాస్తవానికి ఆయ‌న జింగిల్స్‌తో అతను తన కెరీర్‌ను ప్రారంభించాడు. 1985 సంవత్స‌రంలో మెన్డోన్సాతో KK మొదటి జింగిల్ వచ్చింది. జింగిల్ టీవిలో టెలికాస్ట్ అయిన నాటి నుంచి ప్ర‌జ‌లు ఆయ‌న‌ను గుర్తించ‌డం ప్రారంభించారు. ఆయ‌న వాయిస్ కు ఒక ప్ర‌త్యేక గుర్తింపును ఇచ్చారు. అయితే ఆయ‌న పాట పాడినందుకు మొద‌టి పారితోష‌కంగా రూ.500 మాత్రమే అందుకున్నారు. 

జోష్‌ నింపే సాంగ్స్ తో ఉర్రూతలూగించిన విలక్షణ సింగర్‌ కేకే.. ఆయన పాడిన అద్భుతమైన తెలుగు పాటలివే

హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమాలో కేకే పాడిన పాట ‘తడప్ తడప్’ ముందుగా రిలీజ్ అయ్యింది. వాస్తవానికి దాని కంటే ముందు రెండు పాటలు పాడిన అవి వెలుగులోకి రాలేదు. అయితే ఈ సాంగ్ కేకే జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. అప్పటి నుంచి ఆయ‌న వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. అది ముజే కుచ్ కెహనా హై సినిమా టైటిల్ ట్రాక్ ‘బందా యే బిందాస్ హై’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా కేకే ఇన్ని బ్లాక్ బస్టర్ సాంగ్స్ పాడినా పెద్దగా అవార్డులు రాలేదు. అయినా తనకు అవార్డులు గెలుచుకోవాలనే కోరిక ఎప్పుడూ లేదని పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. కేకే తన చిన్ననాటి ప్రియురాలు జ్యోతి కృష్ణను వివాహం చేసుకున్నారు.