ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సింగర్ మృతి ఒక్క సారిగా దేశ సంగీత ప్రియులను విషాదంలో ముంచేసింది. ఆయన మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.
బాలీవుడ్ సింగర్ కేకే (53) కన్నుమూశారు. అయన మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “ కేకేగా పేరుగాంచిన ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ అకాల మరణం బాధాకరం. ఆయన పాటలు అనేక రకాల భావోద్వేగాలను వ్యక్తపరుస్తాయి. కేకే పాటలు అన్ని వయసుల వారిని తాకాయి. ఆయనను పాటల ద్వారా మనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా సానుభూతి. ఓం శాంతి” అని ప్రధాని ట్వీట్‌లో పేర్కొన్నారు.
కేకే (Krishnakumar Kunnath) మృతి పట్ల కేంద్ర హోం అమిత్ షా (amit shah) కూడా విచారం వ్యక్తం చేశారు. ‘‘ KK చాలా ప్రతిభావంతుడు. బహుముఖ గాయకుడు. ఆయన అకాల మరణం చాలా బాధాకరం. భారతీయ సంగీతానికి తీరని లోటు. తన ప్రతిభ గల గాత్రంతో అసంఖ్యాక సంగీత ప్రియుల మదిలో చెరగని ముద్ర వేశారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి శాంతి ’’ అంటూ ట్వీట్ చేశారు.
జోష్ నింపే సాంగ్స్ తో ఉర్రూతలూగించిన విలక్షణ సింగర్ కేకే.. ఆయన పాడిన అద్భుతమైన తెలుగు పాటలివే
కోల్ కత్తా ( Kolkata) లో సాయంత్రం కచేరీలో దాదాపు గంట పాటు స్టేజ్ పై పాడిన తర్వాత కేకే తన హోటల్‌కు చేరుకున్నాడు. తరువాత అస్వస్థతకు గురయ్యాడని అధికారులు తెలిపారు. అయితే కేకే ను దక్షిణ కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తాము అతనికి చికిత్స చేయలేకపోవడం దురదృష్టకరమని ఆసుపత్రి సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
