Asianet News TeluguAsianet News Telugu

 భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాలి : అనూప్ జలోటా సంచలన డిమాండ్

భక్తి పాటల గాయకుడు అనూప్ జలోటా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో హిందువుల  జనాభా అధికంగా ఉన్నందువల్ల మన దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని సంచలన డిమాండ్ చేశారు. దీనివల్ల ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది.

Singer Anup Jalota says India should be Hindu Rashtra
Author
First Published Feb 16, 2023, 3:17 AM IST

అనూప్ జలోటా భజన సామ్రాట్‌గా దేశంలోనే ఫేమస్. అతను తన కీర్తనలతో భక్తులను కట్టిపడేస్తాడు.కానీ.. ఆయన తరుచు సంచలన ప్రకటనలతో వార్తల్లో నిలుస్తారు. తాజాగా భజన పాటల గాయకుడు అనుప్ జలోటా మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. సంచలన డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.  

హిందూ దేశంగా మార్చాలి 

నిజానికి భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ అంశంపై పలుమార్లు వివాదాలు కూడా వచ్చాయి. పలువురు నేతలు ఇదే డిమాండ్‌ చేశారు. తాజాగా ప్రముఖ భజన గాయకుడు అనూప్ జలోటా కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. స్నేహితులారా.. భారత్-పాకిస్థాన్ విడిపోయినప్పుడు పాకిస్థాన్‌ను ఇస్లామిక్ దేశంగా ప్రకటించారని, ఎందుకంటే ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారని.. భారతదేశంలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. కాబట్టి.. బారత్ ను హిందూ దేశంగా ప్రకటించాలని అన్నారు.

అప్పుడు .. భారత్ ను హిందూ దేశంగా ప్రకటించలేదు. కానీ ఇప్పుడైనా ప్రకటించాలని అన్నారు. ప్రపంచంలో ఒక్క హిందూ దేశం కూడా లేదు. కొన్ని రోజుల క్రితం నేపాల్.. హిందూ దేశంగా ఉండే.. కానీ.. ఇప్పుడు కాదు. దాన్ని కూడా హిందూ దేశం అనలేమని పేర్కొన్నారు. భారత దేశంలో హిందువులు అధికంగా ఉన్నారని, ఈ డిమాండ్‌ను వినిపించేవారి సంఖ్య పెరుగుతోందని తెలిపారు. దీనివల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు.   

అనూప్ జలోటా కూడా ఉగ్రదాడి అంశాన్ని లేవనెత్తారు. కశ్మీర్‌లో వచ్చిన మార్పులను కూడా ఆయన ప్రస్తవించారు. జమ్మూ-కశ్మీరు విషయంలో చేసినట్లుగానే ..కేంద్రం ఒక్క ప్రకటన చేస్తే సరిపోతుందని అన్నారు. ప్రస్తుతం జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గాయని, శాంతి ఏర్పడిందని అన్నారు.

ప్రజలు  ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు. గతంలో కంటే తీవ్రవాద దాడులు తగ్గాయని పేర్కొన్నారు. ప్రస్తుతం భజన గాయకుడు అనూప్ జలోటా వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. గతంలో మధ్యప్రదేశ్‌లోని బాగేశ్వర్ ధామ్‌ చీఫ్ ధీరేంద్ర శాస్త్రి మన దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios