Asianet News TeluguAsianet News Telugu

భారత ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన సింగపూర్.. ఈ నెల 26 నుంచి అమల్లోకి..

భారత ప్రయాణికులపై విధించిన కఠిన నిబంధనలను సడలిస్తున్నట్టు సింగపూర్ ప్రకటించింది. ఈ దేశం నుంచి ప్రయాణికులను దేశంలోకి అనుమతిస్తామని, అయితే, తమ దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత పది రోజుల క్వారంటైన్ మాత్రం కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని వివరించింది. మంగళవారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. భారత్‌తోపాటు మరో ఐదు దేశాలకు ఈ సడలింపులు వర్తించనున్నాయి.
 

singapore removes restrictions on indian passengers
Author
New Delhi, First Published Oct 23, 2021, 6:19 PM IST

న్యూఢిల్లీ: Indiaలో coronavirus పరిస్థితులు ఇప్పుడిప్పుడే కొంత స్థిరత్వాన్ని సాధిస్తుండటంతో Singapore కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులను ఈ నెల 26వ తేదీ నుంచి దేశంలోకి అనుమతిస్తామని వెల్లడించింది. భారత్‌తోపాటు బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల నుంచి ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతిస్తామని సింగపూర్ ఆరోగ్య శాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ తెలిపారు.

అయితే, ఈ ఆరు దేశాల నుంచి వచ్చే వారు సింగపూర్‌లో అడుగుపెట్టగానే కచ్చితంగా పది రోజులు Quarantine పూర్తి చేయాలని ఓ మెలిక పెట్టారు. నిర్దేశిత సదుపాయంలో వారు ఈ పది రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని ఆ ప్రకటన పేర్కొంది.

Also Read: బ్యాకాంక్ ట్రిప్ కి ఇక గ్రీన్ సిగ్నల్..!

ఈ ఆరు దేశాలపై విధించిన ఆంక్షలను ఇటీవలే సమీక్షించామని ఆరోగ్య శాఖ మంత్రి ఓంగ్ వివరించారు. అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ఆరు దేశాల నుంచి ప్రయాణికులను అనుమతించలేమని తెలిపారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయని, అందుకే నిబంధనలు సడలిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఆ దేశాల్లో కొంత స్థిరత్వం ఏర్పడిందని వివరించారు. కాబట్టి, వాటిపై కఠిన నిర్ణయాలు అమలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. మంగళవారం నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని తెలిపారు. మలేషియా, ఇండోనేషియా దేశం నుంచి వచ్చే ప్రయాణికులపైనా ఆంక్షలు సడలిస్తున్నట్టు పేర్కొన్నారు.

శుక్రవారం నాటికి ఈ దేశంలో మొత్తం 1,65,663 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా కారణంగా ఈ దేశంలో 294 మంది మరణించారు.

Follow Us:
Download App:
  • android
  • ios