flash flood: ఆకస్మిక వరదలు.. 27 మంది మృతి, 146 మంది మిస్సింగ్
Gangtok: సిక్కింలో ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 27కు చేరింది. అలాగే, గల్లంతైన 146 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారం తెల్లవారు జామున మేఘాల విస్ఫోటనం కారణంగా 25,000 మందికి పైగా ప్రభావితమయ్యారు. అలాగే, ఆకస్మిక వరదలతో ఎనిమిది మంది ఆర్మీ జవాన్లతో సహా 27 మంది మరణించారనీ, సుందరమైన హిమాలయ రాష్ట్రం రూపురేఖలు దారుణంగా మారడంతో పాటు 1,200 కి పైగా ఇండ్లు దెబ్బతిన్నాయి. 13 వంతెనలు వరదల ధాటికి కొట్టుకుపోయాయి.

Sikkim flash floods: సిక్కింలో ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 27కు చేరింది. అలాగే, గల్లంతైన 146 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారం తెల్లవారు జామున మేఘాల విస్ఫోటనం కారణంగా 25,000 మందికి పైగా ప్రభావితమయ్యారు. అలాగే, ఆకస్మిక వరదలతో ఎనిమిది మంది ఆర్మీ జవాన్లతో సహా 27 మంది మరణించారనీ, సుందరమైన హిమాలయ రాష్ట్రం రూపురేఖలు దారుణంగా మారడంతో పాటు 1,200 కి పైగా ఇండ్లు దెబ్బతిన్నాయి. 13 వంతెనలు వరదల ధాటికి కొట్టుకుపోయాయని ల్యాండ్ రెవెన్యూ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్మెంట్ సెక్రటరీ కమ్ స్టేట్ రిలీఫ్ కమిషనర్ శనివారం తెలిపారు.
ప్రస్తుతం అందుతున్న నివేదికల ప్రకారం.. ఉత్తర సిక్కింలో ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 27కు చేరుకుంది. ఇంకా 146 మంది గల్లంతయ్యారని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. అక్టోబర్ 6 అర్ధరాత్రి సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (SSDMA) నివేదిక ప్రకారం, మరణాల సంఖ్య 26కు చేరుకుంది. 2413 మందిని రక్షించారు. 1203 ఇళ్లు ఆకస్మిక వరదలో దెబ్బతిన్నాయి. ఉత్తర సిక్కింలోని హిమానీనదంతో నిండిన ల్హోనాక్ సరస్సు అక్టోబర్ 4న తీస్తా నదీ పరీవాహక ప్రాంతంలో ఆకస్మిక వరదను ప్రేరేపించింది.
మొత్తం 1173 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2413 మందిని రక్షించారు. 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. తీస్తా నది పరివాహక ప్రాంతంలో వరదల కారణంగా 13 వంతెనలు కొట్టుకుపోయాయి. 22 సహాయ శిబిరాల్లో మొత్తం 6875 మంది ఆశ్రయం పొందుతున్నారు. సిక్కిం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం 25,065 మంది ప్రజలు వరదల వల్ల ప్రభావితమయ్యారు. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం మింటోక్‌గ్యాంగ్‌లోని తన అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రఘు శ్రీనివాసన్, సిక్కిం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీబీ పాఠక్, డీజీపీ సిక్కిం, ఏకే సింగ్, 17 మౌంటైన్ డివిజన్ డిప్యూటీ జీవోసీ, ఐటీబీపీ డీఐజీలు పాల్గొన్నారు. సిక్కిం ఉర్జా లిమిటెడ్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం విపత్తు బాధిత ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక సహాయ ప్యాకేజీని రూపొందించిందని సీఎం ఒక ప్రకటనలో తెలిపారు.
మంగన్ జిల్లాలోని తీవ్ర ప్రభావిత ప్రాంతాలలో రోడ్డు ఇతర నెట్‌వర్క్ కనెక్టివిటీని పునరుద్ధరించడానికి సాధ్యమైన అన్ని మార్గాలను అన్వేషించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. చుంగ్‌తాంగ్ వరకు రోడ్డు కనెక్టివిటీని ప్రారంభించేందుకు ప్రాధాన్యతనిచ్చామనీ, నాగా నుంచి తూంగ్ వరకు వీలైనంత త్వరగా రవాణా మార్గం అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారిన విపత్తుల నేపథ్యంలో అనేక మంది అధికారులు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎస్‌ఎస్‌డిఎంఏ) సిబ్బంది, అంకితభావంతో కూడిన స్వచ్ఛంద సేవకులు సహాయక చర్యలు, సాయం చేయడంలో అవిశ్రాంతంగా నిమగ్నమై ఉన్నారని సీఎం తెలిపారు.