ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం గోమూత్రాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతున్నది. ఈ నెల 28వ తేదీన ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం గోమూత్రాన్ని కొనుగోలు చేయనుంది. గోధన్ న్యాయ్ యోజన కింద ప్రభుత్వం గోమూత్రాన్ని రూ. 4కు కొనుగోలు చేస్తుంది.
రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం గోమూత్రాన్ని కొనుగోలు చేయనుంది. లీటర్ గోమూత్రాన్ని రూ. 4 చొప్పున కొనుగోలు చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నది. గోధనర్ న్యాయ్ యోజన కింద ఈ గోమూత్రాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. జులైూ 28న స్థానికంగా నిర్వహించే హరేలీ పండుగ రోజున ఈ కార్యక్రమం చేపట్టనుంది.
గోధన్ న్యాయ్ యోజన కింద ఇప్పటికే గోవు పేడను కొనుగోలు చేస్తున్నారు. పశువుల పెంపకందారుల ఆదాయాలు పెంచడానికి, ఆర్గానిక్ రైతులు లబ్ది పొందేలా రెండేళ్ల క్రితమే ఆవు పేడను గోధన్ న్యాయ్ యోజన కింద కొనుగోలు చేస్తున్నారు.
గోమూత్రాన్ని తొలి దశలో ప్రతి జిల్లాలో రెండు ఎంపిక చేసిన సెల్ఫ్ సపోర్టింగ్ గోధన్‌ల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
గోధన్ న్యాయ్ మిషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అయ్యాజ్ తంబోలి మాట్లాడుతూ, గోధన్ న్యాయ్ యోజన కింద నిర్వహించే బ్యాంక్ ఖాతాల ఫండ్ ఇంటరెస్ట్ డబ్బులతో గోధన్ మేనేజ్‌మెంట్ కమిటీ గోమూత్రాన్ని కొనుగోలు చేస్తుందని వివరించారు. గోధన్‌లలో గోమూత్రాన్ని కొనుగోలు చేసు ప్రక్రియను కలెక్టర్లు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.
జిల్లాలో స్వతంత్ర ఇండిపెండెంట్ గోధన్‌లను గుర్తించే బాధ్యత కలెక్టర్లదేనని వివరించారు. ఈ విధానంలో కొనుగోలు చేసిన గోమూత్రాన్ని పురుగులు, చెద నివారణ మందుల కోసం ఉపయోగిస్తారని తంబోలి వివరించారు.
