ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భార్యతో బెంగళూరు రూరల్ ఎస్పీ భీమశంకర్ సాగించిన అక్రమ సంబంధంతో కర్ణాటక పోలీస్ శాఖ పరువు గంగలో కలిసిపోయింది. ఆ ఘటన ఇంకా మరువకముందే అదే కర్ణాటకలో తనకింద పనిచేసే కానిస్టేబుల్ భార్యతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఓ ఎస్ఐ.. గత కొద్దిరోజులుగా గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న ఈ వివాహేతర బంధాన్ని ఓ ప్రమాదం రట్టు చేసింది.

బళ్లారి  జిల్లా ఎస్పీ కార్యాలయంలో వైర్‌లెస్ విభాగంలో పనిచేస్తున్న ఎస్ఐ కిరణ్.. నగరంలోని పోలీస్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు.. అదే క్వార్టర్స్‌లో ఉంటున్న బళ్లారి తాలుకాలోని పరమదేవనహళ్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ భార్యతో వివాహేతర సంబంలధం పెట్టుకున్నాడు. గత బుధవారం తన గదిలో వీరిద్దరూ కలిసి ఉండగా. కిరణ్ ఫుల్లుగా తాగి ఉన్నాడు.. మద్యం మత్తులో సిగరెట్ కిందపడేయగా.. గాలికి నిప్పురవ్వలు సోఫాసెట్‌ మీద పడి మంటలు చెలరేగాయి..

క్షణాల్లోనే అది ఇంటి మొత్తానికి వ్యాపించింది.. పెద్దఎత్తున మంటలు వ్యాపించడంతో వారు ప్రాణభయంతో బయటకు తీసుకొచ్చారు..ఆ సమయంలో వారిద్దరూ అర్థనగ్నంగా ఉండటంతో చుట్టుపక్కల వారికి అక్రమ సంబంధం గురించి తెలిసింది. వీరిద్దరిపై కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సదరు కానిస్టేబుల్ భార్యకు ఇద్దరు పిల్లలు కూడా ఉండటంతో.. ఇదేం పాడుపనని చుట్టుపక్కల వారు ముక్కున వేలేసుకున్నారు.