సామాన్యుల జీవితాలను, ప్రకృతి అందాలను, పల్లెటూరి వాతావరణాన్ని తన కెమెరాలో బంధిస్తూ...తనకు ఇష్టమైన ఫోటోగ్రఫీ పీల్డులో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి కందుకూరి రమేష్ బాబు. తాను తీసిన సహజ అందాలను ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ''సామాన్య శాస్త్రం'' పేరుతో వివిధ నగరాల్లో ఫోటో షో లను నిర్వహిస్తుంటారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఈ షో నిర్వహించగా విశేష స్పందన వచ్చింది. తాజాగా ఆయన ఫోటో షో ముంబైలో కొనసాగుతోంది.

ముంబైలోని జహంగిర్ ఆర్ట్ గ్యాలరీలో కొనసాగుతున్న ఈ ఫోటోగ్రపీ షోకి ప్రముఖ దర్శకులు, దాదాసాహెబ్ పాల్కె అవార్డు గ్రహీత శ్యాం బెనెగల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రమేష్ బాబు కెమెరా నుండి జాలువారిన ఫోటోలను చూసి శ్యాంబెనెగల్ మంత్రముగ్ధులయ్యారు. ఫోటోలను చాలా సహజంగా తీయడమే కాకుండా అందంగా తీశారంటూ రమేష్ బాబు ను ప్రశంసించారు. 

ఈ సందర్భంగా బెనెగల్ తెలంగాణతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తన చిన్నతనంలో  హైదరాబాద్ లో గడిపిన క్షణాలను...ఇక్కడి నుండి ముంబై వరకు  కొనసాగిన ప్రయాణాన్ని వివరించారు. ఇలా ఫోటోలను చూస్తూ...తన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ దాదాపు గంటసేపు శ్యాంబెనెగల జహంగీర్ ఆర్ట్స్ గ్యాలరీలో గడిపినట్లు రమేష్ బాబు తెలిపారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఫోటో షో కు విచ్చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.