అయోధ్య: శ్రీరామ మందిర నిర్మాణానికి సంబంధించిన నమూనాలను రామ జన్మభూమి ట్రస్టు మంగళవారంనాడు విడుదల చేసింది.

భారతీయ వాస్తు శిల్పానికి , దైవత్వం, వైభవం అభివ్యక్తికి ప్రత్యేకమైన ఉదహరణగా ఈ నమూనా ఉంటుందని ట్రస్టు తెలిపింది. ఇది ప్రతిపాదిత నిర్మాణం యొక్క చిత్రాలు అంటూ ట్విట్టర్ లో ట్రస్టులో ప్రకటించింది.161 అడుగుల ఎత్తైన మూడంతస్థుల్లో రామ మందిరాన్ని నిర్మించనున్నారు. 

also read:అయోధ్యలో భూమి పూజపై కరోనా ఎఫెక్ట్:అర్చకుడికి పాజిటివ్, వారికి సైతం...

రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ ఈ నెల 5వ తేదీన చేపట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఎంపిక చేసిన 200 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని  ట్రస్టు ప్రధాన కార్యదర్శి 35 మత సంస్థలకు చెందిన 135 మంది సాధువులతో సహా 175 మందికి ఆహ్వానం పలికారు.

 

కరోనా కారణంగా అన్నిజాగ్రత్తలు తీసుకొన్నారు.  అయోధ్యలోని పురవీధులను అలంకరించారు. హెలిపాడ్ నుండి  అయోధ్యకు వెళ్లే మార్గంలో రాముడి జీవిత చరిత్రను తెలిపే పెయింటింగ్స్ ఏర్పాటు చేశారు.  

అయోధ్యవాసులు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు నగరంలో పలు చోట్ల టీవీలను కూడ ఏర్పాటు చేశారు.