Asianet News TeluguAsianet News Telugu

అయోధ్యలో భూమి పూజపై కరోనా ఎఫెక్ట్:అర్చకుడికి పాజిటివ్, వారికి సైతం...

అయోధ్యలో అర్చకుడితో పాటు 16 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. ఈ ఏడాది ఆగష్టు 5వ తేదీన రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఈ సమయంలో ఇక్కడ పనిచేసేవారికి కరోనా సోకడం కలకలం రేపుతోంది.

Priest 16 Cops Involved In Ayodhya Ram Temple Event Test Covid +ve
Author
Ayodhya, First Published Jul 30, 2020, 2:09 PM IST


అయోధ్య: అయోధ్యలో అర్చకుడితో పాటు 16 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. ఈ ఏడాది ఆగష్టు 5వ తేదీన రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఈ సమయంలో ఇక్కడ పనిచేసేవారికి కరోనా సోకడం కలకలం రేపుతోంది.

అయోధ్యలో ప్రధాన ఆలయ అర్చకుడి అసిస్టెంట్ గా ఉన్న ప్రదీప్ దాస్  కు కరోనా సోకింది. 16 మంది పోలీసులకు కూడ కరోనా సోకింది. రామ జన్మభూమి కాంప్లెక్స్ వద్ద వీరంతా విధులు నిర్వహిస్తున్నారు.

కరోనా నేపథ్యంలో అన్ని నియమాలను పాటిస్తూ రామ మందిర నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు. రామ జన్మభూమి కాంప్లెక్స్ వద్ద నిర్వహించే కార్యక్రమానికి సుమారు 200 మంది అతిథులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుడితో పాటు అతిథులు, స్థానికులు పాల్గొంటారని రామజన్మభూమి  ట్రస్టు ప్రకటించింది.

 

also read:అయోధ్యలో 2 వేల అడుగుల లోతులో టైమ్స్ క్యాప్సూల్

ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు . కార్యక్రమం జరిగే ప్రాంతానికి మూడు కి.మీ. దూరంలో హెలిపాడ్ ఏర్పాటు చేశారు.  ఆలయ మార్గానికి వెళ్లే మార్గాన్ని వెడల్పు చేశారు. ఈ మార్గంలో రాముడి జీవిత చరిత్రను తెలిపే పెయిటింగ్స్ ను ఏర్పాటు చేశారు.అయోధ్యలో పెద్ద ఎత్తున సీసీటీవీలను ఏర్పాటు చేశారు. ఈ టీవీల ద్వారా భక్తులు రామజన్మభూమి వద్ద జరిగే కార్యక్రమాన్ని వీక్షించవచ్చని ట్రస్టు తెలిపింది.

రామజన్మభూమి ఉద్యమానికి సంబంధం ఉన్న బీజేపీ సీనియర్ నేతలకు ఆహ్వానం పలికినట్టుగా ట్రస్టు తెలిపింది.ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతి, వినయ్ కతియార్, సాధ్వీ రితంబరలకు ఆహ్వానం అందింది.ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడ ఈ కార్యక్రమానికి హాజరౌతారని చెబుతున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios