Asianet News TeluguAsianet News Telugu

ఐదుగురు మైనర్లపై అత్యాచారం చేసిన షాపు యజమాని, సహకరించిన తల్లులు.. ఫోన్ చెక్ చేస్తే షాకింగ్ విషయాలు..

ఫోన్ ఫోటో గ్యాలరీని తనిఖీ చేస్తున్నప్పుడు, మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన 50 వీడియోలు పోలీసుల కంట పడ్డాయి. మొదట నిందితుడు, చైల్డ్ పోర్న్ వీడియోలను డౌన్‌లోడ్ చేశాడని పోలీసులు అనుకున్నారు. ఆ తరువాత వాటిని నిశితంగా పరిశీలించినప్పుడు వీడియోల్లో ఉన్న వ్యక్తి అతనే అని గుర్తించి షాక్ అయ్యారు. 

Shopkeeper sexually assaults 5 girls in Chennai
Author
Hyderabad, First Published Aug 30, 2021, 9:43 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తమిళనాడు : చెన్నైలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. నాలుగు నుంచి 13 యేళ్ల బాలికలపై వరుస అత్యాచారాలు కలకలం రేపాయి. నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుతో ఓ దుకాణం మీద పోలీసులు దాడి చేశారు. 

ఈ క్రమంలో షాపు యజమాని అయిన 48 ఏళ్ల వ్యక్తి ఫోన్ తనిఖీ చేసిన పోలీసులు షాక్ కు గురయ్యారు. అతని సెల్‌ఫోన్‌లో పిల్లలపై అత్యాచారం చేసిన 50 వీడియో క్లిప్‌లను పోలీసులు గుర్తించారు. ఆ ఐదుగురు మైనర్ల పై కూడా అతనే అత్యాచారం చేశాడని తేలింది. దీంతో పెరుమాళ్ అనే ఆ నిందితుడిని ఆదివారం పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.

అంతేకాదు.. తమ కుమార్తెలపై అత్యాచారానికి అంగీకరించిన 28, 30 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మహిళలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. శనివారం కిరాణా షాపులో గుట్కా నిల్వ చేసినట్లు సమాచారం అందుకున్న టిపి చత్రం పోలీసులు షాపుపై దాడి చేసి పొగాకు ఉత్పత్తుల బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా డీలర్ల వివరాల కోసం దుకాణదారుడి ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఫోన్ ఫోటో గ్యాలరీని తనిఖీ చేస్తున్నప్పుడు, మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన 50 వీడియోలు పోలీసుల కంట పడ్డాయి. మొదట నిందితుడు, చైల్డ్ పోర్న్ వీడియోలను డౌన్‌లోడ్ చేశాడని పోలీసులు అనుకున్నారు. ఆ తరువాత వాటిని నిశితంగా పరిశీలించినప్పుడు వీడియోల్లో ఉన్న వ్యక్తి అతనే అని గుర్తించి షాక్ అయ్యారు. 

దీంతో వెంటనే కిల్పాక్ డిప్యూటీ కమిషనర్ కార్తికేయన్, ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి నేతృత్వంలోని బృందం పెరుమాళ్‌ను విచారించింది. ఈ విచారణలో పెరుమాళ్ గత ఆరు నెలలుగా మైనర్లపై పదేపదే అత్యాచారం చేస్తున్నట్లు నేరం అంగీకరించాడు. 

Mysuru Gangrape Case : వాంగ్మూలం ఇవ్వకుండా.. కుటుంబంతో సహా ఊరొదిలి వెళ్లిపోయిన బాధితురాలు.. !

ఈ దారుణాల్లో పెరుమాళ్ కు ఇద్దరు అక్కాచెల్లెళ్లైన మహిళలు సహకరించారు. ఎంత దారుణం అంటే వారు.. తమ సొంత పిల్లలపై అత్యాచారం చేయడానికి కూడా అనుమతించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరిలో ఓ మహిళకు పెరుమాళ్‌తో ఎఫైర్ ఉంది. ఆ తరువాత ఆమె తన సోదరిని  పెరుమాళ్ కు పరిచయం చేసింది.

తన దుకాణంలో కొన్న వస్తువులకు బదులుగా తమ పిల్లలపై అత్యాచారం చేయడానికి ఆ మహిళలు అంగీకరించారని పెరుమాళ్ పోలీసులకు చెప్పాడు. అంతేకాదు ఆ ఇద్దరు పిల్లలతో పాటు వారింట్టో ఆడుకోవడానికి వచ్చిన ఆ చిన్నారుల..ముగ్గురు స్నేహితులపై కూడా అత్యాచారం చేశాడు. దాన్ని వీడియో తీశారు. 

"పెరుమాళ్ ఆరు నెలలకు పైగా తమపై అత్యాచారం చేస్తున్నప్పటికీ..తమకు ఏమి జరుగుతుందో తమ తల్లిదండ్రులకు చెప్పలేని పసితనం వారిది’’ అని డిప్యూటీ కమిషనర్ కార్తికేయన్ అన్నారు. అయితే ఈ ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు మొదట పోలీసులకు.. తాము పనికోసం బైటికి వెళ్లినప్పుడు తమ పిల్లల్ని ఆ ఇద్దరు మహిళలు జాగ్రత్తగా చూసుకున్నారని తెలిపారు. 

ఈ విషయం తెలిసి వారు షాక్ అయ్యారు. దీనిమీద మాట్లాడుతూ "ఇది షాకింగ్ కేసు. ఇన్స్‌పెక్టర్ నిందితుడి మొబైల్ ఫోన్‌ని తనిఖీ చేయకపోతే, కేసు వెలుగులోకి వచ్చేది కాదు. ఆ నీఛుడి బారిన ఇంకా ఎక్కువ మంది పిల్లలు పడేవారు ”అని కార్తికేయ అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios