ఢిల్లీలో ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌ల మధ్య ఎదురుకాల్పులు.. పరుగులు తీసిన జనాలు
దేశ రాజధాని ఢిల్లీ తుపాకుల మోతతో దద్దరిల్లింది. కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్లు అయిన.. గోగి గ్యాంగ్‌కు టిల్లు గ్యాంగ్‌కు ఆధిపత్యం, పాతగొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో బురారీ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి.. కాల్పులకు దారి తీసింది.. ఈ కాల్పుల్లో టిల్లు గ్యాంగ్‌లోని ముఠా సభ్యుడు రాజు మరణించాడు.. పట్టపగలు రోడ్డుపై యుద్ధవాతావరణ నెలకొనడంతో జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది..
గత వారం కూడా ఢిల్లీలోని చత్రపూర్‌లో పోలీసులకు, రాజేశ్ భారతి గ్యాంగ్‌కు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ పోరులో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ రాజేశ్ భారతితో పాటు అతని ముఠా సభ్యులు ముగ్గురు హతమయ్యారు.
