Asianet News TeluguAsianet News Telugu

మహిళపై సామూహిక అత్యాచారం, సిగరెట్ తో ప్రైవేట్ భాగాల్లో కాల్చి, కత్తితో గాట్లు పెట్టి చిత్రహింసలు..

ముంబైలోని కుర్లాలో బుధవారం తెల్లవారుజామున దారుణ ఘటన జరిగింది. ఓ మహిళ మీద సామూహిక అత్యాచారం చేసి దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. 
 

shocking.. woman gang raped and tortured sharp weapons in mumbai
Author
First Published Dec 5, 2022, 10:33 AM IST

ముంబయి : ముంబాయిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 42 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను చిత్రహింసలను గురిచేశారు. ఈ మేరకు బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... ముగ్గురు నిందితులు ఆమె ఇంట్లోకి బలవంతంగా చొరబడి ఆమె మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పదునైన ఆయుధంతో ఆమె మీద దాడి చేసి, సిగరెట్‌తో ఆమె ప్రైవేట్ భాగాలపై కాల్చారు. ఆమె ఫిర్యాదు మేరకు ముంబై పోలీసు అధికారి ఆదివారం ఈ వివరాలు వెల్లడించారు. 

ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున కుర్లాలో జరిగిందని, నిందితులు, బాధితురాలు ఒకే ప్రాంతంలో ఉండేవారేనని పోలీసులు తెలిపారు. "ఆమె ఇంట్లోకి ప్రవేశించిన నిందితులు ఆమెపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేయడంతోపాటు అసహజ శృంగారానికి కూడా పాల్పడ్డారు. ఆమె ప్రైవేట్ భాగాలను సిగరెట్‌తో కాల్చారు. ఆమె ఛాతీ, రెండు చేతులపై పదునైన ఆయుధంతో దాడి చేశారు. నిందితులలో ఒకరు ఈ సంఘటనను వీడియో తీశారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపితే ఆ వీడియోను సోషల్ మీడియాలో ప్రసారం చేస్తామని బెదిరించారు" అని పోలీసులు తెలిపారు. 

మహాకాల్ ఆలయంలో మహిళల డ్యాన్స్ వీడియో వైరల్... ఇద్దరు సెక్యురిటీ సిబ్బంది సస్పెండ్..

ఈ దారుణం నుంచి బయటపడిన మహిళ.. ఇరుగుపొరుగున ఉండే తన స్నేహితులదగ్గర ఈ విషయాన్ని చెప్పి భయాందోళనకు గురయ్యింది. వారు ఓ ఎన్జీవో సహాయంతో పోలీసులను సంప్రదించారు. అలా ఈ ఘటన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కుర్లా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ముగ్గురిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 376 (రేప్), 376డి (గ్యాంగ్ రేప్), 377 (అసహజ సెక్స్), 324 (ప్రమాదకరమైన ఆయుధాలతో స్వచ్ఛందంగా గాయపరచడం) ఇతర నేరాల కింద అభియోగాలు మోపారు. నిందితులను పట్టుకోవడానికి గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా, తెలంగాణ, హైదరాబాదులోని పాతబస్తీలో పేదరికం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలను టార్గెట్ గా చేసుకుని ఓ ముఠా చేస్తున్న దారుణమైన నేరాలు బయటపడ్డాయి.. ఆర్థిక ఇబ్బందులతో పేదరికంతో మగ్గిపోతున్న మహిళలు, యువతులను లక్ష్యంగా చేసుకుని ఓ వ్యభిచార ముఠా ఘోరాలు చేస్తోంది. ఇలాంటి కొంత మంది మహిళలను ఎంపిక చేసి వారిని టార్గెట్ చేసి,  బలవంతంగా వ్యభిచారంలోకి దిగుతున్నారు. మొదట ఆ మహిళల నగ్న చిత్రాలను, వీడియోలు తీస్తారు. ఆ తర్వాత వాటిని మీడియేటర్లకు చూపిస్తారు. ఆ దళారులు  ఆ మహిళలు యువతుల శరీరాలకు ధర నిర్ణయిస్తారు. 

గత కొంతకాలంగా ఈ దారుణం యదేచ్ఛగా జరుగుతోంది. ఇది గమనించిన ఒక సోషల్ ఆక్టివిస్ట్.. ధైర్యంగా చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం అందించి వారి సహాయంతో వ్యభిచార ముఠా ఆగడాలకుఆగడాలను అడ్డుకున్నారు. చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ  నేతృత్వంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..కర్ణాటక, బీదర్ జిల్లాలోని రాజేశ్వర్ గ్రామానికి చెందిన సయ్యద్ హుస్సేన్ (35) లారీ డ్రైవర్గా పని చేస్తూ.. కల్బుర్గి లో వ్యభిచార గృహాలను నడిపే  గులాం అనేవ్యక్తికి ప్రధాన అనుచరుడిగా పనిచేస్తున్నాడు. అతనే ఈ నేరాలకు పాల్పడ్డట్టు తేలింది.

Follow Us:
Download App:
  • android
  • ios