Asianet News TeluguAsianet News Telugu

మహాకాల్ ఆలయంలో మహిళల డ్యాన్స్ వీడియో వైరల్... ఇద్దరు సెక్యురిటీ సిబ్బంది సస్పెండ్..

మహకాల్ ఆలయంలో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు దేవాలయంలో బాలీవుడ్ పాటలకు డ్యాన్సులు చేస్తూ వీడియోలు చేశారు. దీంతో వీరిద్దరినీ సస్పెండ్ చేశారు.

security personnels make dance video inside Mahakal temple in MadhyaPradesh, two women suspended
Author
First Published Dec 5, 2022, 9:47 AM IST

మధ్యప్రదేశ్‌ : మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లాలోని మహాకాళేశ్వర్ ఆలయ ప్రాంగణంలో ఇద్దరు మహిళలు నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో వీరిద్దరూ ఆలయంలో బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేశారు. అయితే వీరిని ఆ ఆలయంలో పనిచేసే సెక్యురిటీ సిబ్బందిగా గుర్తించారు. 

ఇద్దరు మహిళలు "జీనే కే బహానే లకోన్", "ప్యార్ ప్యార్ కర్తే కర్తే" అనే బాలీవుడ్ హిట్‌ సాంగ్స్ కు డ్యాన్స్ చేశారు. వీరిద్దరు   నలుపు రంగు దుస్తులు వేసుకుని ఉన్నట్టు ఇందులో కనిపిస్తుంది. వీరిని ఆలయంలోని సెక్యూరిటీ సిబ్బందిలో పనిచేస్తున్న వారిగా గుర్తించారు. ఈ వీడియో వైరల్ కావడంతో దుమారం చెలరేగింది. ఉజ్జయిని ఏడిఎం సంతోష్ ఠాగూర్ ఈ విషయాన్ని మహాకాల్ దేవాలయ అడ్మినిస్ట్రేటర్ సందీప్ సోని దృష్టికి తీసుకువెళ్లారు. 

విచిత్రం.. అక్కడ ఎటు చూసినా ద్రౌపదులే.. ఒక్కొక్క మహిళకు ఐదుగురు, అంతకుమించి భర్తలు...ఎక్కడంటే..

దీంతో వారు వెంటనే నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆ ఇద్దరు మహిళలను సెక్యూరిటీ విధుల్లోనుంచి తొలగించారు. ఉజ్జయిని ఎడిఎం సంతోష్ ఠాగూర్ మాట్లాడుతూ, మహకాల్ ఆలయంలో పనిచేస్తున్నవారు అప్‌లోడ్ చేసిన ఈ డ్యాన్స్ వీడియో గురించి మీడియాలో వచ్చిన వార్తల ద్వారా తనకు తెలిసిందన్నారు. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios