లవ్ జిహాద్ కేసు పెట్టిన వారికి దిమ్మదిరిగే ట్విస్ట్.. ఆ ఎఫైర్‌తో షాక్
ఉత్తరప్రదేశ్‌లో లవ్ జిహాద్ అంటూ హిందు యువతి కుటుంబం, కొందరు రైట్ వింగ్ కార్యకర్తలు పోలీసు స్టేషన్‌కు వెళ్లి కేసు నమోదు చేయించారు. కనిపించకుండా పోయిన ఆ యువతిని పోలీసులు ట్రేస్ చేయగానే దిమ్మదిరిగే ట్విస్ట్ బయటపడింది. అది లవ్ జిహాద్ కాదని, గే లవ్ అని తెలిసింది.
Love Jihad: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ముస్లిం అన్నదమ్ములు, వారి తల్లిపై లవ్ జిహాద్ ఆరోపణలతో కేసు పెట్టారు. హిందు యువతిని కిడ్నాప్ చేశారని, బలవంతంగా ఆమెను మత మార్పిడి చేసే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు. కానీ, ఈ కేసులో దిమ్మదిరిగే ట్విస్ట్ బయట పడింది.
28 ఏళ్ల యువతి మే 26వ తేదీన కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబం, కొందరు రైట్ వింగ్ యాక్టివిస్టులు కలిసి బరేలీ జిల్లాలోని అవోన్లా పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. లవ్ జిహాద్ కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. మే 30వ తేదీన అపహరణ, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు.
గురువారం పోలీసులు ఆ హిందూ యువతిని ట్రేస్ చేశారు. అయితే, ఆమె తన ‘గర్ల్‌ఫ్రెండ్’తో కనిపించింది. దీంతో కేసు పెట్టిన వారికి, ఆ యువతి కుటుంబానికి దిమ్మదిరిగే షాక్ తగిలింది. అది లవ్ జిహాద్ కాదని, సేమ్ సెక్స్ మ్యారేజ్ కేసు అని తెలియవచ్చింది. కనిపించకుండా పోయిన యువతి.. మరో యువతిని ప్రేమించింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలినే ప్లాన్‌లో ఉన్నారు.
యువతిని పోలీసులు ట్రేస్ చేసిన తర్వాత ఆమె తన స్టేట్‌మెంట్‌లో ఇలా పేర్కొంది. ‘మేం మూడేళ్లుగా ఒకరికొ కరం తెలుసు. ప్రేమలో ఉన్నాం. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. సేమ్ సెక్స్ మ్యారేజీపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నాం’ అని ఆ యువతి వివరించింది.
Also Read: Tamlahal: సూఫీలకు కేంద్రంగా ఈ కశ్మీరీ గ్రామం.. ఇప్పటికీ సూఫీ సాంప్రదాయాలు సజీవం
తమ కుటుంబం వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నదని, అందుకే తాను ఇల్లు వదిలి పారిపోయి వచ్చానని వివరించింది. ఈ ట్విస్టు బయటపడగానే.. ఆ యువతి సోదరుడు మాట్లాడాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఆ యువతి సోదరుడు మాట్లాడుతూ.. ‘మా తల్లిదండ్రులు తొమ్మిదేళ్ల క్రితమే మరణించారు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు నేనే మోస్తున్నా. నా సోదరికి మంచి విద్య అందిచగలిగాను. ఆమె కనిపించకుండా పోగానే మా ఏరియాలోనే నివసిస్తున్న ఇద్దరు సోదరుల పాత్ర అందులో ఉన్నదని అనుమానించాను. అందుకే వారిపై కేసు పెట్టాను’ అని వివరించాడు.
‘ఇప్పుడు నేను నా సోదరితో మాట్లాడాను. కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా ఆమె అంగీకరించలేదు. కాబట్టి, ఏ కేసులోనైనా ఆ ఇద్దరు సోదరులు, వారి కుటుంబం పై ఎలాంటి యాక్షన్ తీసుకోరాదని చెప్పాను’ అని పేర్కొన్నాడు.
ఆ ఇద్దరు మహిళలు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారని, వారి ఇష్టపూర్వకంగా కలిసి జీవిస్తున్నట్టు ఓ అఫిడవిట్ సమర్పించారని స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఓపీ సింగ్ తెలిపారు.
తమ ప్రాథమిక దర్యాప్తులో ఇది లవ్ జిహాద్ కాదని, ఆ కుటుంబం ఫిర్యాదులో పేర్కొన్న వారి పాత్ర ఇందులో ఏమీ లేదని, కాబట్టి, వారికి క్లీన్ చిట్ ఇచ్చినట్టు బరేలీ రూరల్ ఏఎస్పీ రాజ్ కుమార్ అగర్వాల్ తెలిపారు.