కర్ణాటక అసెంబ్లీలో ఉన్న ఏకైక మహిళా మంత్రి జయమాల. ఒకప్పుడు సినిమాల్లో నటించిన జయమాల.. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇటీవల కర్ణాటక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాగా.. ఆమె అందం గురించి మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో కన్నడనటి, మంత్రి జయమాల గ్లామర్‌ గురించి మాజీ మంత్రి బహిరంగంగా కొనియాడారు. బుధవారం ఉడుపిలో కాంగ్రెస్‌ నేత ప్రమోద్‌ మధ్వరాజ్‌ స్థానిక సంస్థల ఎన్నికల కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సమయంలో ఉడుపి జిల్లా ఇన్‌చార్జ్‌మంత్రి జయమాల గ్లామర్‌గా ఉందని, ఆమె జిల్లా పర్యటనతో జయమాల గాలి వీస్తోందని అన్నారు. ఒక్కరోజు ప్రచారంతో జిల్లాలో తీవ్ర ప్రభావం చూపారని, జయమాల తనకంటే గ్లామరస్‌ గా ఉందని అన్నారు. మంత్రి వ్యాఖ్యలతో కార్యకర్తలు, విలేకరులు తెల్లబోయారు.