Asianet News TeluguAsianet News Telugu

పనిచేస్తూ కడుపునొప్పితో కిందపడ్డ 14యేళ్ల చిన్నారి... ఆస్పత్రికి తీసుకువెడితే వెలుగులోకి షాకింగ్ విషయం..

రాజస్థాన్లోని జోధ్పూర్ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలిక దగ్గరలోని పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది.  diwali సందర్భంగా స్కూలుకు సెలవు ఉండడంతో కుటుంబ సభ్యులకు సహాయం చేస్తుంది. ఆ క్రమంలోనే ఆ చిన్నారికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. 

shocking 14 years old girl tested 8 months pregnant in rajasthan
Author
Hyderabad, First Published Nov 5, 2021, 11:12 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రాజస్థాన్ లో స్థానికంగా ఉన్న పాఠశాలలో పదో తరగతి చదువుతున్న చిన్నారికి ప్రస్తుతం 14 ఏళ్లు. నిన్న మొన్నటి వరకు స్కూలుకు బాగానే వెళ్ళింది. పండుగ  సందర్భంగా పాఠశాలకు  సెలవు  ప్రకటించడంతో  గురువారం ఇంటి వద్దే ఉంది.  
అంతే కాకుండా దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులు పనుల్లో బిజీగా ఉండడంతో ఆమె కూడా ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంది. అయితే అప్పటి వరకు బాగానే ఉన్నా ఆ చిన్నారి అకస్మాత్తుగా Abdominal pain వచ్చింది. 

దీంతో బంధువులు ఆమెను దగ్గరలోని hospitalకి తరలించారు.  ఈ క్రమంలో ఆమెను పరీక్షించిన  వైద్యులు షాక్ అయ్యారు.  కాగా ఇంతకీ ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్లోని జోధ్పూర్ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలిక దగ్గరలోని పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది.  diwali సందర్భంగా స్కూలుకు సెలవు ఉండడంతో కుటుంబ సభ్యులకు సహాయం చేస్తుంది. ఆ క్రమంలోనే ఆ చిన్నారికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. 

దీంతో దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.  అక్కడ అమ్మాయిని పరీక్షించిన వైద్యులు షాకయ్యారు.14 ఏళ్ల బాలిక pregnant అని తెలిసి కంగు తిన్నారు.  పురిటి నొప్పులతో ఆమె బాధపడుతుండటంతో ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని ఆ తర్వాత ఈ విషయాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. 

ఈ సందర్భంగా అధికారులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఈ అంశంపై తల్లిదండ్రులను నిలదీశారు. అయితే, వారి వద్ద నుంచి సమాధానం లేకపోవడంతో అధికారులు షాక్ అయ్యారు. పద్నాలుగేళ్ల కూతురు  గర్భవతి అని కుటుంబ సభ్యులకు ముందే తెలుసా అని ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

ఆదిశంకరాచార్యుల సూత్రాలు నేటికి వర్తిస్తాయి: కేదార్‌నాథ్ లో మోడీ ప్రత్యేక పూజలు

రాజస్థాన్ లో విధవరాలైన కోడలి మీద మామ దాష్టీకం...

రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఓ మహిళ  కొన్నేళ్ళ క్రితం ఓ వ్యక్తిని పెళ్లాడింది.  వారికి ఓ అమ్మాయి కూడా జన్మించింది.  కూతురుకు  పెళ్లీడు వయసు వచ్చిన తర్వాత..  తాజాగా  husband కన్నుమూశాడు. దీంతో ఒంటరైన ఆమె..  కూతురును చూసుకుంటూ అత్తవారింట్లోనే ఉంటుంది.  భర్త దూరమైన విషయాన్ని ఇంకా జీర్ణించుకోకముందే మామ నుంచి ఆమెకు Harassment మొదలయ్యాయి.

‘నువ్వు  మంత్రగత్తెవు.. ఇంటి నుంచి వెళ్ళిపో’ అని ఆమెను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసాడు. అయితే దానికి ఒప్పుకోకపోవడంతో అతడు మరింత రెచ్చిపోయాడు. తాజాగా ఓ పిడుగులాంటి వార్త ఆమె చెవిన వేశాడు.  నువ్వు, నీ కూతురు స్నానం చేస్తుంటే  రహస్యంగా వీడియో తీశాను.  నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే వాటిని social mediaలో పెడతాను అంటూ ఆమెను బెదిరించాడు.  

దీంతో ఆమె తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీరుమున్నీరయింది చివరికి పోలీసులను ఆశ్రయించింది. అత్తవారింట్లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పోలీసులకు వివరించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us:
Download App:
  • android
  • ios