మహా సీఎంగా ఉద్ధవ్: డిప్యూటీ సీఎంలుగా ఆ ఇద్దరే?
మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ ఠాక్రే ఈ నెల 28న ప్రమాణం చేయనునన్నారు. అయితే ఉద్దవ్ ఠాక్రే కేబినెట్ లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
ముంబై:నెల రోజుల పాటు జరిగిన నాటకీయ పరిణామాలకు ఈ నెల 26వ తేదీన తెరపడింది.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్నిఏర్పాటు చేయనున్నాయి. ఉద్దవ్ ఠాక్రే కేబినెట్ లో ఇద్దరు డిప్యూటీ సీఎంలకు చోటు దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
బీజేపీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా మూడు రోజుల పాటు పనిచేశారు. ఈ నెల 26న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ ఠాక్రే ఈ నెల 28వ తేదీ ప్రమాణం చేయనున్నారు. శివాజీ స్టేడియంలో ఉద్దవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఉద్దవ్ ఠాక్రేతో పాటు బాలాసాహెబ్ తొరాట్, ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ కూడ ప్రమాణం చేసే అవకాశం ఉంది.
Also Read:నేను ఎన్సీపీలోనే ఉన్నా: అజిత్ పవార్
కొన్ని గంటల క్రితమే మహారాష్ట్ర సీఎం పదవికి బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. అసెంబ్లీలో తగిన సంఖ్యాబలం లేదనే ఉద్దేశ్యంతో దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు.
ఈ నెల 23వ తేదీన అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ లు డిప్యూటీ సీఎం, సీఎంలుగా ప్రమాణం చేశారు. అయితే అసెంబ్లీలో బీజేపీకి తగినంత మెజారిటీ లేనందున అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. ప్రొటెం స్పీకర్ గా కాళిదాస్ కొలంబకర్ ప్రమాణం చేయించారు.శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ కూటమిలో ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే విషయమై ఈ మూడు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో మంతనాలు జరుపుతున్నారు.