Asianet News TeluguAsianet News Telugu

అగ్ర వర్షాల మహిళలపై కామెంట్.. మంత్రిపై శివరాజ్ సింగ్ సీరియస్..!

గిరిజన నాయకుడు ,మంత్రి బిసాహులాల్ సింగ్ బుధవారం రాష్ట్రంలోని అనుప్పూర్ జిల్లాలో ఒక సభలో ప్రసంగిస్తూ సామాజిక వర్గాల నేపథ్యంలో మహిళలు వారి పనుల గురించి మాట్లాడుతూ తుఫానును సృష్టించారు.
 

Shivraj Chouhan Warns Minister Over Remark On Upper-Caste Women, State BJP Apologises
Author
hyderabad, First Published Nov 29, 2021, 12:48 PM IST

అగ్రవర్ణాల మహిళల గురించి వివాదాస్పద కామెంట్స్ చేసినందుకు గాను తమ మంత్రి వర్గంలోని  మంత్రి పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. సదరు మంత్రిని తాను హెచ్చరించినట్లు స్వయంగా.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేయడం గమనార్హం.

గిరిజన నాయకుడు ,మంత్రి బిసాహులాల్ సింగ్ బుధవారం రాష్ట్రంలోని అనుప్పూర్ జిల్లాలో ఒక సభలో ప్రసంగిస్తూ సామాజిక వర్గాల నేపథ్యంలో మహిళలు వారి పనుల గురించి మాట్లాడుతూ తుఫానును సృష్టించారు.

" పెద్ద కులాలకు చెందిన  వ్యక్తులు తమ మహిళలను ఇళ్లకే పరిమితం చేస్తారు  వారిని బయటకు వెళ్లనివ్వరు," అని మంత్రి అన్నారు, "మా గ్రామాల్లో (సమాజంలోని దిగువ శ్రేణి నుండి) మహిళలు పొలాల్లో పని చేస్తారు. ఇంటి పనులు చేస్తారు." అంటూ పేర్కొన్నారు.

Also Read: Farm Laws Repeal Bill: వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

పెద్ద సమాజిక వర్గానికి చెందిన వ్యక్తులు.. తమ ఇంటి మహిళలను.. ముందుకు వెళ్లనివ్వడం లేదని.. ఎదగనివ్వడం లేదా అంటూ ఆయన కామెంట్ చేయడం గమనార్హం.

ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్, "నేను బిసాహులాల్ సింగ్ జీకి ఫోన్ చేసాను. అతను తన ప్రకటనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. సెంటిమెంట్ ఏదైనా, సందేశం తప్పుగా ఉండకూడదు. ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ప్రకటనలు చేయవద్దని హెచ్చరించానని చెప్పారు.

Also Read: సింగర్ హరిణి తండ్రి హత్య కేసు.. ఆ ఒంటిపై గాయాలన్నీ.. ఆయన చేసుకున్నవేనా..?

ప్రజలకు తప్పుడు సందేశం పంపే ఇలాంటి భావాలను వ్యక్తపరిచే వ్యక్తులను క్షమించబోమని చౌహాన్ అన్నారు,  రాష్ట్రంలోని తల్లి, కూతురు, చెల్లి, అక్క ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కేలా చేయడం తమ ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు.  గిరిజన నాయకుడి ప్రకటన దురదృష్టకరమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ కూడా పేర్కొనడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios