Asianet News TeluguAsianet News Telugu

సింగర్ హరిణి తండ్రి హత్య కేసు.. ఆ ఒంటిపై గాయాలన్నీ.. ఆయన చేసుకున్నవేనా..?

గాయాలు చేసుకున్న తర్వాత ఆయన తలకు రైలు ఢీకొట్టడంతోనే మృతి చెంది ఉంటారని.. కుటుంబీకులు ఆరోపిస్తున్నట్లు హత్య కాదని, ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని రైల్వే (జీఆర్‌పీ) డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ డి.అశోక్‌ పేర్కొన్నారు.

Forensic Report Of Ak Rao Death Case
Author
hyderabad, First Published Nov 29, 2021, 11:58 AM IST


బెంగళూరులో ఇటీవల  సింగర్ హరిణి తండ్రి ఏకే రావు అనుమానాదాస్పత మృతిలో  ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన శరీరంపై బ్లేడు, కత్తితో గాయాలు ఉన్నట్లు కూడా గుర్తించారు.. ఆయన శరీరంపై ఆ గాయాలు చేసింది ఎవరు..? అనే  ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. కాగా.. దీనికి సమాధానం తాజాగా ఫోరెన్సిక్ నివేదికలో తేలింది.

ఈ ప్రశ్నకు ఆయనకు ఆయనే ఆ గాయాలు చేసుకున్నట్లు ఫోరెన్సిక్‌ నివేదిక స్పష్టం చేస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఇంకా ఆ నివేదిక బయటకు రావాల్సి ఉంది. అయితే, కుటుంబీకులు అది హత్యేనని.. దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసిన నేపథ్యంలో పోలీసులు ఆ దిశలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అది హత్య కాకపోవచ్చని, ఆత్మహత్యే అయి ఉంటుందని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. గాయాలు చేసుకున్న తర్వాత ఆయన తలకు రైలు ఢీకొట్టడంతోనే మృతి చెంది ఉంటారని.. కుటుంబీకులు ఆరోపిస్తున్నట్లు హత్య కాదని, ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని రైల్వే (జీఆర్‌పీ) డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ డి.అశోక్‌ పేర్కొన్నారు.

Also Read: సుజనా పౌండేషన్ సీఈఓ ఏకే రావు మృతిపై సమాచారం లేదు: హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్


పోస్టుమార్టం పూర్తిస్థాయి నివేదిక వచ్చాకగానీ ఏ విషయం చెప్పలేమని అన్నారు. అక్కడ లభించిన బ్లేడ్‌, కత్తి గురించి ప్రశ్నించగా వాటిని ఆయనే తీసుకొచ్చి ఉంటారని చెప్పారు. రైలు ఢీకొట్టడంతోనే ఏకే రావు మరణించారని, ఫోరెన్సిక్‌ నిపుణులు సైతం ప్రమాద స్థలిని సందర్శించి ధ్రువీకరించారని తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని.. కత్తి, బ్లేడ్‌ ఎక్కడి నుంచి సేకరించారనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు. 

ఇదిలా ఉండగా ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే..... ప్రముఖ సింగర్ హరిణి తండ్రి, సుజనా ఫౌండేషన్ సీఈవోగా ఉన్న ఏ.కే.రావు అనుమానాస్పద స్థితిలో బెంగళూరులో మరణించారు. ఆయన మృతదేహం బెంగళూరులోని ఓ రైల్వే ట్రాక్‌పై గుర్తించారు. ఏకే రావు తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.  గత వారం రోజులుగా ఏకే రావు కుటుంబ సభ్యులతో సహా అదృశ్యమయ్యారు. ఎక్కడికి వెళ్లారో స్పష్టత లేదు. కానీ హఠాత్తుగా ఆయన మృతదేహం రైలు పట్టాలపై కనిపించింది.

తన తండ్రిది ఖచ్చితంగా హత్యేనని సింగర్ హరిణి అనుమానిస్తున్నారు. ఈ మేరకు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. ఆ రిపోర్టులు రావాల్సి ఉంది. ఏకే రావు మృతదేహం రైల్వే ట్రాక్‌పై దొరికిన తర్వాత అప్పటి వరకూ ఆచూకీ లేని కుటుంబసభ్యులు బెంగళూరులోని మార్చురీ వద్దకు వెళ్లారు. తమ ఫిర్యాదు కూడా పోలీసులకు ఇచ్చారు. 

ఏకే రావు కుటుంబసభ్యుల మధ్య ఏమైనా కుటుంబ గొడవలు ఉన్నాయా అనే దిశగా బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏకే రావు ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఎవరైనా హత్య చేశారా అన్నది పోస్ట్ మార్టంలో తేలే అవకాశం ఉంది. ఏకే రావు కుమార్తె సింగర్ హరిణి మాత్రం ఖచ్చితంగా హత్యేనని నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios