తాజాగా ఓటర్ల జాబితాలోకి దేవుడు కూడా ప్రత్యక్షమయ్యాడు. షిరిడీ సాయిబాబా ఫోటో, డీటైల్స్ తో ఓటర్ ఐడీ తయారు చేసేందుకు ఓ వ్యక్తి కుట్ర పన్నినట్లు అధికారులు తెలియజేశారు.

ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరగడం కొత్తేమీ కాదు. ఒకరి ఫోటోకి బదులు మరొకరి ఫోటో.. ఒకరి పేరుకి బదులు మరోకరి పేరు వస్తుంటాయి. అంతేకాదు.. ఒక్కోసారి ఎవరో పేరు మీద సెలబ్రెటీల ఫోటోలు కూడా దర్శనమిస్తుంటాయి. తాజాగా ఓటర్ల జాబితాలోకి దేవుడు కూడా ప్రత్యక్షమయ్యాడు. షిరిడీ సాయిబాబా ఫోటో, డీటైల్స్ తో ఓటర్ ఐడీ తయారు చేసేందుకు ఓ వ్యక్తి కుట్ర పన్నినట్లు అధికారులు తెలియజేశారు.

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో షిరిడి సాయిబాబాని ఓటర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటేచాలు.. ఓటు లేనివారంతా ఓటర్ ఐడీ కోసం అప్లై చేస్తుంటారు. ఇది సర్వసాధారణం. అదేవిధంగా అహ్మద్ నగర్ జిల్లాలో కూడా అధికారులు ఈ ప్రాసెస్ పెట్టారు.

అయితే.. ఓ వ్యక్తి అతి తెలివిగా వ్యవహరించి.. షిరిడి సాయి ఫోటో, గుడి అడ్రస్ తదితర వివరాలతో ఓటర్ ఐడీ కి అప్లై చేశాడు. గమనించిన అధికారులు ఆ అప్లికేషన్ ని క్యాన్సిల్ చేసి.. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అందులో సాయిబాబా వయసు 24, తండ్రి రామ్ గా పేర్కొనడం విశేషం.