కోట్లాది మంది షిర్డీ సాయి భక్తులకు శుభవార్త. షిర్డీలో బంద్ విరమిస్తున్నట్లు స్థానిక ప్రజలు ప్రకటించారు. ఈ వివాదంపై సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేతో షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ సమావేశం అయిన తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని స్థానికులు తెలిపారు.

కాగా సాయి బాబా జన్మస్థలంగా కొందరు భక్తులు భావిస్తోన్న పర్భనీ జిల్లాలోని పత్రి పట్టణ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ఉద్ధవ్ థాక్రే చేసిన ప్రకటన వివాదాస్పదమైంది.

Also Read:షిర్డీ వివాదం: రేపు ఉద్ధవ్ థాక్రే‌తో షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ భేటీ, సర్వత్రా ఉత్కంఠ

ఆ ప్రాంతాన్ని సాయి జన్మస్థలంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. పత్రిని అభివృద్ధి చేస్తే.. షిరిడీ ప్రాధాన్యం తగ్గిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ షిర్డీలో బంద్ నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో షిరిడీ ఆలయాన్ని నిరవధికంగా మూసివేస్తారని సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొట్టాయి. దీనిపై స్పందించిన షిర్డీ సంస్థార్ ట్రస్ట్.. ఆదివారం నుంచి ఆలయాన్ని మూసివేస్తారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.

Also Read:సాయి జన్మభూమి వివాదం: షిరిడీలో కొనసాగుతున్న బంద్... అత్యవసరంగా సమావేశమైన మహా సీఎం

బాబాకు ఎప్పటిలాగే హారతి, ప్రత్యక పూజలు కొనసాగుతాయని ఆలయంలో భక్తుల దర్శనాలు సైతం రోజులాగే కొనసాగుతాయని క్లిరాటీ ఇచ్చింది. మరోవైపు ఈ వివాదం నిదానంగా రాజకీయ రంగు పులుముకుంది.

శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం సాయి బాబా జన్మస్థలాన్ని వివాదంలోకి లాగుతోందని బీజేపీ మండిపడింది. షిర్డీ ప్రజలు న్యాయపోరాటానికి దిగుతారని అహ్మద్‌నగర్ ఎంపీ సుజయ్ విఖే పాటిల్ హెచ్చరించారు.