Asianet News TeluguAsianet News Telugu

‘ఆమె గర్భంతో ఉన్నా కూడా అత్యాచారం చేశారు’-బిల్కిస్ బానో ఘటనను తల్చుకుంటూ ఉద్వేగానికి లోనైన ఒవైసీ

బిల్కిస్ బానో ఘటనను తలుచుకుంటూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉద్వేగానికి గురయ్యారు. గుజరాత్ చివరి దశ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇది చోటు చేసుకుంది. 

She was raped even when she was pregnant - Owaisi is emotional while addressing the Bilkis Bano incident
Author
First Published Dec 4, 2022, 1:40 PM IST

ఆవేశపూరిత ప్రసంగాలకు పేరుగాంచిన ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం ఒక్క సారిగా ఉద్వేగానికి లోనయ్యారు. గుజరాత్‌లోని జమాల్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా బిల్కిస్ బానో కేసును ప్రస్తావిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

వార్నీ.. నాగుపాముకు స్నానం చేయించిన యువకుడు.. వీడియో వైరల్.. నెటిజన్లు షాక్..

‘‘ఆమె (బిల్కిస్ బానో) గర్భవతిగా ఉన్నప్పుడు అత్యాచారం చేశారు. ఆమె తల్లి, కూతురును కూడా చంపేశారు. అయితే 20 ఏళ్లు దాటినా బాధితురాలు న్యాయం కోసం ఇంకా పోరాడుతూనే ఉంది. ఈ నొప్పి ఎలాంటిదో తెలుసుకోకపోతే అతడు మనిషి అని పిలిపించుకునేందుకు అర్హుడు కాడు.’’ అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉద్వేగానికి లోనయ్యారు.

‘కశ్మీర్ ఫైల్స్ ప్రాపగాండనే’.. నడవ్ లాపిడ్‌ను సమర్థించిన మరో ముగ్గురు జ్యూరీ సభ్యులు

దీనిపై ఒవైసీ మాట్లాడుతూ.. బిల్కిస్ బోనో గురించి మాట్లాడుతున్నప్పుడు తన సొంత అక్కచెల్లెళ్లు, కూతుళ్ల ఆలోచనలు వచ్చాయని, అందుకే భావోద్వేగం అయ్యాయని అన్నారు. ‘‘ మనమందరం ముందుగా మనుషులం. భావోద్వేగానికి గురవుతుంటాం.నేను బిల్కిస్ బానో విషయంలో మాట్లాడుతున్నప్పుడు నా సొంత సోదరి, నా కూతురు నా మదిలో మెదిలింది’’ అని అన్నారు.

2002 గోద్రా అనంతర అల్లర్లు, బిల్కిస్ బానో కేసు ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎందుకు ముందుకు వచ్చిందని ఒవైసీ ప్రశ్నించారు. 2002ను బీజేపీ ఎప్పటికీ మరిచిపోదని అన్నారు. ‘‘ ఆ సమయంలో ప్రధాని మోడీ సీఎం. ఆయన బిల్కిస్ బానో, ఎహ్సాన్ జాఫ్రీ, బేకరీలో మరణించిన వారిని రక్షించడంలో విఫలమయ్యాడు. రాష్ట్రంలో దాదాపు 50,000 మంది శరణార్థులుగా మారాల్సి వచ్చింది. నేను కూడా వైద్య బృందంతో అక్కడికి వెళ్లాను. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ అప్పుడు జరిగినదంతా ఇప్పుడు ప్రస్తావిస్తున్నారంటే ఆయనకు అభినందనలు’’ అని ఆయన అన్నారు.

ప్రియుడితో కలిసి మహిళ మాస్టర్ ప్లాన్.. భర్త మృతి కేసులో షాకింగ్ విషయాలు.. అత్తను కూడా అలానే చంపేసిందా?

ఎన్నికలలో తన పార్టీ విజయావకాశాలను ఒవైసీ ప్రస్తావిస్తూ.. ‘‘ మేము శాసన సభలో 13 స్థానాల కోసం పోటీపడుతున్నాం. వాటిని గెలుచుకోవడంపైనే మా దృష్టి ఉంది. మేము చాలా కష్టపడి పని చేశాం. ప్రతీ ప్రాంతాన్ని సందర్శించాం. అన్ని చోట్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ మద్దతు ఓట్లుగా మారుతాయని, మా అభ్యర్థులు ఎమ్మెల్యేలు అవుతారని నేను ఆశిస్తున్నాను.’’ అని అన్నారు. కాగా.. గుజరాత్ లో రెండో దశ ఎన్నికలు నేడు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios