ఓ వ్యక్తి నాగు పాముకు తీరిగ్గా స్నానం పోయించాడు. భారీ పొడవుగా ఉన్న ఆ పాము కూడా అతడిని ఏమీ అనకుండా సహకరించింది. దీనిని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. 

ప్రతి రోజూ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో మనస్సును కదిలించేవి కొన్ని ఉంటే.. మరికొన్నితలలు గోక్కునేలా ఉంటాయి. కొన్ని ఆహ్లాదాన్ని పంచితే, మరి కొన్ని చిరాకు తెప్పిస్తాయి. మరి కొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంతకీ దాంట్లో ఏముందంటే ?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
Scroll to load tweet…

ఓ వ్యక్తి నాగుపామును తీసుకెళ్లి దానికి స్నానం పోయిస్తున్నాడు. దానికి నాగుపాము కూడా సహకరిస్తోంది. పడగ విప్పి అటూ ఇటూ తలతిప్పుతోంది. కానీ తనపై నీళ్ల పోసే వ్యక్తిని ఏం అనడం లేదు. భారీ పొడవుగా ఉన్న పాముపై బకెట్ లో నుంచి నీళ్లు తీసి, మగ్ తో దానిపై పోస్తున్నాడు. 22 సెకన్లు ఉన్న ఈ వీడియో జిందగీ గుల్జార్ హై అనే పేజీలో పోస్టు అయ్యింది. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.

Scroll to load tweet…

‘‘ ఈ చలితో పేద పాముకు నీళ్లతో స్నానం చేయిస్తున్నాను’’ అనే క్యాప్షన్ తో పోస్టు అయిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 24 వేలకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. దీనిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. తమ ఆలోచనలను పంచుకుంటున్నారు. 

Scroll to load tweet…

‘‘జిందగీ సే విశ్వాస్ ఉత్ చుకా హై ఇస్ అద్మీ కా (ఈ మనిషి తన జీవితం గురించి పట్టించుకోవడం లేదు) అని ఓ యూజర్ కామెంట్ చేశారు. 

Scroll to load tweet…

మరో యూజర్ ‘‘పాముకు జలుబు రాదు’’ అని కామెంట్ చేశాడు. ఇంతకీ ఈ తుంటరి పని గురించి మీరేమనుకుంటున్నారు. ?