Asianet News TeluguAsianet News Telugu

నేడు జైలు నుంచి విడుదల కానున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. భావోద్వేగ ట్వీట్ చేసిన భార్య నవజ్యోత్ కౌర్

పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ నేడు జైలు నుంచి విడుదల కానున్న నేపథ్యంలో ఆయన భార్య నవజ్యోత్ కౌర్ ట్విట్టర్ లో భావద్వేగ పోస్టు పెట్టారు. 1988 యాక్సిడెంట్ కేసులో పాటియాల జైలులో ఆయన ఏడాది నుంచి శిక్ష అనువిస్తున్నారు. అది నేటితో ముగియనుంది. 

Navjot Singh Sidhu who will be released from jail today.. Navjot Kaur's wife sent an emotional tweet.. ISR
Author
First Published Apr 1, 2023, 10:56 AM IST

పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ శనివారం పాటియాలా జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారిక ట్విట్టర్ ఖాతా శుక్రవారం వెల్లడించింది. 1988 జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో సిద్దూ పాటియాల జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ కేసులో ఆయనకు కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం ఆ శిక్ష నేటితో పూర్తికానుంది. ఈ క్రమంలో మాజీ కాంగ్రెస్ నేత విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పాపం పెళ్లి కూతురు.. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది..!

ఈ నేపథ్యంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ సతీమణి నవజ్యోత్ కౌర్ సిద్ధూ భావోద్వేగానికి గురయ్యారు. పంజాబ్‌పై కాంగ్రెస్‌ నేత సిద్ధూకు ఉన్న ప్రేమ తనను అనుబంధాల పరిధి నుంచి బయటపడేలా చేసిందని నవజ్యోత్ కౌర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. నవజ్యోత్ చేసింది కరెక్ట్ కాదన్నది వాస్తవమేనని పేర్కొన్నారు. ‘‘ఆయనకు శిక్ష విధించాలని నేను కూడా అడిగాను. కానీ పంజాబ్ పై నవజ్యోత్ కు ఉన్న ప్రేమ అన్నింటికీ మించినది. ప్రతీ మనిషికి తనదైన విధి ఉంటుంది. ఆయనను ప్రశ్నించే హక్కు మాకు లేదు. నిజంగా ఎవరైనా మెరుగవ్వాలంటే అది మనమే.’’ అని అన్నారు. 

ఈ నెల ప్రారంభంలో సిద్ధూ భార్య తనకు స్టేజ్ 2 ఇన్వాసివ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ సమయంలో కూడా ఆమె ట్విట్టర్ లో ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. తాను 2 ఇన్వాసివ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని దానికి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని ఆమె ట్విట్టర్ పోస్టులో వెల్లడించారు. “నా భర్త నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేయని నేరానికి జైలు పాలయ్యాడు. నేరంలో పాల్గొన్న వారందరినీ క్షమించండి. ప్రతిరోజూ నీ కోసం ఎదురుచూడటం నీకంటే ఎక్కువ బాధ కలిగిస్తుంది. ఎప్పటిలాగే మీ బాధను దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, దానిని పంచుకోమని అడిగారు. చిన్న ఎదుగుదల చూడడం జరిగింది, అది చెడ్డదని తెలిసింది.’’ అని పేర్కొన్నారు. 

త‌గ్గిన కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు.. ప్ర‌స్తుత ధ‌ర‌లు ఇవే..

అమృత్ సర్ మాజీ ఎమ్మెల్యే అయిన సిద్ధూకు 1988 రోడ్డు ప్రమాదం కేసులో సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పోలీసులకు లొంగిపోయారు. తరువాత ఆయనను పాటియాల జైలుకు తీసుకొచ్చారు. హత్యానేరం కింద ఈ మాజీ కాంగ్రెస్ నేత నిర్దోషిగా విడుదలైనప్పటికీ స్వచ్ఛందంగా గాయపరిచినందుకు దోషిగా తేలడం గమనార్హం. దీంతో అతడికి ఏడాది జైలు శిక్ష, 1000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో అతడి అనుచరుడు రూపిందర్ సింగ్ సంధును నిర్దోషిగా ప్రకటించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios