ఢిల్లీ మెట్రోలో ఓ జంట లోకాన్ని మర్చిపోయింది. మెట్రో కదులుతున్న సమయంలోనే ఒకరినొకరు కౌగిలించుకొని, ముద్దులు పెట్టుకున్నారు. దీనిని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

ఓ జంట మెట్రో రైలులోనే రెచ్చిపోయింది. హగ్ చేసుకొని, ముద్దులు పెట్టుకుంటూ లోకాన్ని మర్చిపోయింది. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మైమర్చిపోయారు. కొత్త లోకంలో మునిగిపోయారు. ఇది ఢిల్లీ మెట్రోలో చోటు చేసుకుంది. మెట్రో బోగీలో ఓ యువకుడు, ఓ యువతి ఒకరిని ఒకరు కౌగిలించుకొని ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై సోషల్ మీడియా యూజర్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి - కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ

ఢిల్లీ మెట్రోలో జంట ముద్దు పెట్టుకుంటున్న వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ వీడియో తీశారు. దానిని ట్విట్టర్ లో పోస్టు చేస్తూ.. ‘‘ఢిల్లీ నుంచి సిగ్గుమాలిన వైరల్ వీడియో’’ క్యాప్షన్ పెట్టారు. పాట్నా జంక్షన్ తర్వాత ఒకప్పుడు ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణీకులంతా ఇబ్బంది పడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 

కేజ్రీవాల్ పై మళ్లీ సంచలన ఆరోపణలు చేసిన సుఖేష్ చంద్రశేఖర్.. నార్కో టెస్ట్ చేయించుకోవడానికైనా రెడీ అంటూ..

అయితే కొందరు నెటిజన్లు ఈ జంట బహిరంగంగా ముద్దు పెట్టుకున్నారని విమర్శించగా, చాలా మంది ఆ జంట అనుమతి లేకుండా వీడియో తీసిన వ్యక్తిపై మండిపడ్డారు. బహిరంగంగా ప్రేమ సంకేతాలు వ్యక్తం చేయడం సాధారణ స్థితికి తీసుకురావాలని పలువురు అభిప్రాయపడ్డారు. ‘‘రైలులో ప్రజలు ముద్దు పెట్టుకుంటే ఢిల్లీ మెట్రో ప్రయాణికులు ఎందుకు అపఖ్యాతి పాలవుతారు? ముంబై వచ్చి చూడండి.. జంటలు ప్రతిచోటా ముద్దు పెట్టుకోవడం, మిగితా వారు తమ పనేదో తాము చూసుకోవడం మీరు గమనించవచ్చు’’ అని ఓ యూజర్ కామెంట్ చేశారు. 

Scroll to load tweet…

మరో యూజర్ ‘‘మరొకరి అనుమతి లేకుండా చిత్రీకరించడం లేదా దానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేయడం ఐపీసీ సెక్షన్ 354 సీ ప్రకారం శిక్షార్హం’’ అని కామెంట్ చేశారు. ఇది ఒక చట్టాన్ని ఉల్లంఘించడమేనని, ఇద్దరు యువకులు ఆప్యాయతను కూడా చూడలేకపోతున్నారని ఓ యూజర్ పేర్కొన్నారు.

అయోధ్య రామమందిరం అంశాన్ని కోర్టులో కాంగ్రెస్ పొడిగిస్తూ వచ్చింది.. అప్పుడే మోడీ వచ్చారు.. - అమిత్ షా

‘‘ముద్దు పెట్టుకోవడం ఓకే కానీ బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం కరెక్ట్ కాదు’’ అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ‘‘ ఢిల్లీ మెట్రో ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రదేశం. సీట్ల విషయంలో ప్రయాణికులు ఒకరికొకరు గొడవ పడటం, నగ్నంగా ప్రయాణించడం, జంటలు బహిరంగంగా ఒకరినొకరు ముద్దు పెట్టుకునే వీడియోలు మన దైనందిన వినోద వనరుగా మారాయి. ఇక్కడ కల్చర్ మారుతుంది!.’’ అని పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రో బికినీ గర్ల్ రిథమ్ చనానా వీడియో సోషల్ మీడియాలో విమర్శలకు గురైన కొద్ది రోజులకే ఈ జంట మెట్రోలో ముద్దు పెట్టుకున్న వీడియో వెలుగులోకి వచ్చింది.