ముంబై: శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో కాంగ్రెసు పార్టీ వ్యవహరించిన తీరుపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కాంగ్రెసు వల్లనే తాము శివసేనకు మద్దతు లేఖ ఇవ్వలేదని ఎన్సీపీ నేత అజిత్ పవార్ మండిపడ్డారు. శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదడానికి గడువులోగా కాంగ్రెసు తన నిర్ణయాన్ని వెల్లడించకపోవడంపై పవార్ ఆసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

ముంబైకి తన నాయకులను పంపించడంలో కాంగ్రెసు ఇష్టపడలేదు. పైగా నేతలను పంపించడానికి బదులు సోనియాతో మాట్లాడడానికి ఢిల్లీకి రావాల్సిందిగా శరద్ పవార్ కు సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యేలతో సమావేశం ఉందని, అందువల్ల తాను రాలేనని శరద్ పవార్ చెప్పారు. దాంతో సోనియా శరద్ పవార్ తో ఫోన్ లో మాట్లాడారు. 

Also Read: Maharashtra government : మహరాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసు

దానికి ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలపై కాంగ్రెసు సీనియర్ నేత అహ్మద్ పటేల్ శరద్ పవార్ తో మాట్లాడారు. సాయంత్రం శివసేన తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ భగత్సిం్గ కోశ్యారీకి సమర్పించాల్సి ఉండింది. అయితే, గడువులోగా కాంగ్రెసు మద్దతు ఇస్తున్నట్లు చెప్పలేదు. శివసేనకు మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకున్న ఎన్సీపీ కాంగ్రెసు లేఖ కోసం ఎదురు చూస్తూ ఉండింది. 

కాంగ్రెసు నుంచి లేఖ వస్తుందని నిన్న (సోమవారం) నిరీక్షిస్తూ వచ్చామని, సాయంత్రానికి కూడా కాంగ్రెసు నుంచి లేఖ రాలేదని, అందువల్ల తాము లేఖను ఇవ్వడం సరి కాదని అనుకున్నామని, నిర్ణయమేదైనా స్థిరంగా ఉండాలని అజిత్ పవార్ మంగళవారంనాడు అన్నారు 

కాంగ్రెసును మీరు నిందిస్తున్నారా అని అడిగితే కలిసి ఎన్నికల్లో పోటీ చేసామని, అందువల్ల తాము కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉండిందని, శివసేనతో కలిసి పోటీ చేయలేదు కాబట్టి కాంగ్రెసు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసిందని, ఎన్సీపీ.. కాంగ్రెసు కలిసి పోటీ చేశాయని ఆయన అన్నారు. 

Also Read: ‘‘మహా’’ సంక్షోభం: శివసేనకు కాంగ్రెస్ చివరి ఘడియ షాక్

శరద్ పవార్,త ప్రఫుల్ పటేల్ తో పాటు తమ పార్టీ నేతలంతా కాంగ్రెసు లేఖ కోసం ఉదయం 10 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు నిరీక్షించారని, శివసేన సాయంత్రం 7.30 గంటలకు లేఖ సమర్పించాల్సి ఉండిందని, కాంగ్రెసు లేఖ పంపించలేదని, అటువంటి స్థితిలో తామెలా లేఖ ఇస్తామని ఆయన అన్నారు.