Asianet News TeluguAsianet News Telugu

Ayodhya: రాజీవ్ గాంధీ హయాంలోనే రామ మందిరానికి శంకుస్థాపన: శరద్ పవార్

రాజీవ్ గాంధీ హయాంలోనే అయోధ్యలోని రామ మందిరానికి శంకుస్థాపన పడిందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. కానీ, ఇప్పుడు రాముడి పేరిట ఆర్ఎస్ఎస్, బీజేపీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.
 

sharad pawar says shilanyas conducted when rajiv gandhi was the prime minister kms
Author
First Published Jan 16, 2024, 8:47 PM IST

Ram Mandhir: ఈ నెల 22న అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. దీనిపై రాజకీయంగానూ వాదప్రతివాదాలు జరుగుతున్నాయి. ఇది ఆర్ఎస్ఎస్, బీజేపీల కార్యక్రమం అని, మోడీ ఫంక్షన్ అని కాంగ్రెస్ విమర్శిస్తున్నది. తాము ఆ కార్యక్రమానికి హాజరుకాబోమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇండియా కూటమి మొత్తంగా ఈ కార్యక్రమానికి ఎడంగానే ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమి పార్టీ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అయోధ్యలోని రామ మందిర శంకుస్థాపన (శిలన్యాస్) కార్యక్రమం రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరిగిందని శరద్ పవార్ గుర్తు చేశారు. ఇప్పుడు అదే కార్యక్రమంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు రాజకీయాలు చేస్తున్నాయని వివరించారు. కర్ణాటకలోని నిప్పానిలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘రాజీవ్ గాంధీ హయాంలో శిలన్యాస్ నిర్వహించారు. కానీ, ఈ రోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు రాముడి పేరు మీద రాజకీయాలు చేస్తున్నాయి’ అని శరద్ పవార్ అన్నారు.

Also Read: YS Sharmila: అన్నా, చెల్లి మధ్య వైరం ఎందుకు మొదలైంది? జగన్‌ను షర్మిల నేరుగా ఢీకొడుతారా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 రోజుల ఉపవాసం గురించి కూడా శరద్ పవార్ స్పందించారు. ‘రాముడిపై ఆయన విశ్వాసాన్ని గౌరవిస్తాను. కానీ, పేదరిక నిర్మూలన కోసం ఆయన ఉపవాసం చేస్తే ప్రజలు హర్షించేవారు’ అని పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios