న్యూఢిల్లీ: ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు జైట్లీ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తున్నారు.

ఆగష్టు 9వ తేదీ రాత్రి అరుణ్ జైట్లీ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో ఆయనను ఎయిమ్స్ లో చేర్పించారు.వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఆరోగ్యం కుదుటపడినట్టుగా అదే రోజు రెండు గంటల తర్వాత వైద్యులు ప్రకటించారు.

ఈ నెల 16వ తేదీన  జైట్లీ  ఆరోగ్యం విషమించినట్టుగా సమాచారం. వైద్యుల బృందం జైట్లీకి చికిత్స అందిస్తున్నారు. ఈ నెల  10వ తేదీ  నుండి ఎయిమ్స్  ఎలాంటి హెల్త్ బులెటిన్ ను విడుదల చేయలేదు.

మాజీ కేంద్ర మంత్రి అరుణ్  జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిన వెంటనే  రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్,కేంద్ర మంత్రి అమిత్ షా యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ తదితరులు ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. శుక్రవారం వీరంతా ఎయిమ్స్ లో జైట్లీని పరామర్శించారు.

2014-19 వరకు మోడీ కేబినెట్ లో జైట్లీ  మంత్రిగా కొనసాగారు. అనారోగ్య కారణాలతో జైట్లీ 2019 మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టలేదు. జైట్లీకి బదులుగా పీయూష్ గోయల్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

ఆరోగ్య సమస్యల కారణంగానే ఆయన 2019 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ కూడ చేయలేదు.2018 మే 14వ తేదీన అరుణ్ జైట్లీకి మూత్ర పిండాల మార్పిడి జరిగింది. 
సంబంధిత వార్తలు

అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమం