న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ  ఆరోగ్యం విషమించింది. ఈ నెల 9వ తేదీన అనారోగ్యంతో జైట్లీని ఎయిమ్స్ లో చేర్పించారు. వైద్య బృందం అరుణ్ జైట్లీకి చికిత్స అందిస్తున్నారు.

కొంత కాలంగా  అరుణ్ జైట్లీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారణంగానే ఈ దఫా ఆయనను కేబినెట్ లోకి కూడ తీసుకోలేదు. అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమించడంతో  ఈ నెల 9వ తేదీ రాత్రి ఆయనను ఎయిమ్స్ లో చేర్పించారు. 

అయితే చికిత్స తర్వాత ఆయన కోలుకొన్నట్టుగా వైద్యులు ప్రకటించారు. కానీ శుక్రవారం నాడు ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించినట్టుగా తెలిసింది.

జైట్లీని పరామర్శించేందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం నాడు ఎయిమ్స్ కు చేరుకోనున్నారు.అనారోగ్యం కారణంగానే 2019 మధ్యంతర బడ్జెట్ ను కూడ పీయూష్ గోయల్ ప్రవేశపెట్టారు.