ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బందా జిల్లాలోని తింద్వారి పోలీస్ స్టేషన్ పరిధిలోని పప్రేండా రహదారిపై గురువారం ఉదయం బొలెరో వాహనం స్కార్పియోను ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించారు.

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బందా జిల్లాలోని తింద్వారి పోలీస్ స్టేషన్ పరిధిలోని పప్రేండా రహదారిపై గురువారం ఉదయం బొలెరో వాహనం స్కార్పియోను ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్నవారు వివాహ వేడుకకు హాజరై చిత్రకూట్ జిల్లా నుంచి బండాకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెండు వాహనాల్లో ఇరుక్కున్న క్షతగాత్రులను వారిని బయటకు తీశారు. వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే వారిలో నలుగురు మృతిచెందినట్టుగా వైద్యులు ప్రకటించారు. 

మృతులను బండా జిల్లాలోని పైలాని పోలీస్ స్టేషన్ పరిధిలోని నివైచ్, పిపర్హరి గ్రామాలకు చెందిన కుల్దీప్, ఛోటూ, కల్లు, ఉమేష్‌లుగా గుర్తించారు.రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న వ్యక్తులు వివాహ ఊరేగింపులో భాగమైనట్లు పోలీసులు తెలిపారు.

ఇక, బాధితులు..నివైచ్‌లో నివాసముంటున్న రాహుల్‌ వివాహానికి హాజరయ్యేందుకు బుధవారం చిత్రకూట్‌కు వెళ్లారు. గురువారం ఉదయం అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే తింద్వారి పోలీస్ స్టేషన్ ఏరియా పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బఫర్ గోడౌన్ సమీపంలో బొలెరో వాహనం స్కార్పియోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.