Asianet News TeluguAsianet News Telugu

ఇండోర్ లో దారుణం.. ఏడేళ్ల చిన్నారి జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లి, కత్తితో పొడిచి హత్య..

ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి.. వీధిలో ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన ఓ యువకుడు ఆమెను అత్యంత దారుణంగా హతమార్చాడు. దీంతో ఇండోర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

seven years old girl kidnapped and stabbed to death in Indore
Author
First Published Sep 24, 2022, 11:26 AM IST

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలికను ఓ యువకుడు కత్తితో పొడిచి చంపాడు. అంతకు ముందు ఆమెను వీధిలో ఈడ్చుకుంటూ తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఈ ఘటన ఇండోర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగింది. యువకుడు ఆమెపై లైంగిక దాడి పాల్పడి ఉంటాడని పోలీసులు, బాలిక కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారి మృతదేహంతో పోలీస్ స్టేషన్ కు పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు లాకప్‌లో ఉన్న 28 ఏళ్ల నిందితుడిపై దాడి చేసేందుకు పోలీస్ స్టేషన్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల మీదికి రాళ్లు రువ్వారు. కార్పొరేషన్ వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ గుంపును చెదరగొట్టడానికి పోలీసులు బలప్రయోగం చేయాల్సి వచ్చింది. 

నిందితుడి ఇంటిగోడ అక్రమ నిర్మాణం అని పోలీసులు ప్రభుత్వాధికారులు కూల్చేశారు. ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగింది. అంతేకాదు నిందితుడు తరచుగా మహిళలను వేధిస్తుంటాడని, ఆ విషయం ఆ ప్రాంతంలోని అందరికీ తెలుసునని స్థానికులు అంటున్నారు. అయితే నిందితుడి కుటుంబ సభ్యులు మాత్రం అతని మానసిక స్థితి సరిగా లేదని పేర్కొన్నారు. 

ప‌శువుల మేత‌కు వెళ్లిన మ‌హిళ‌ కిడ్నాప్.. 36 రోజుల పాటు గ్యాంగ్ రేప్.. 3 ల‌క్ష‌లు ఇచ్చిన త‌రువాత విడుద‌ల

ఇక ఘటన వివరాల్లోకి వెడితే... ఉదయం 11 గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి అపహరణకు గురైందని డీసీపీ అమిత్ తోలానీ తెలిపారు. ఆ తరువాత నిందితుడి ఇంట్లో నుంచి కేకలు వినిపించడంతో.. ఇరుగుపొరుగు వారు బాలికను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ అతని ఇంటి తలుపులు లోపలి నుంచి గడియపెట్టి ఉన్నాయి. దీంతో కోపోద్రిక్తులైన వారు తలుపు తెరవమని గట్టిగాకేకలు వేస్తూ తలుపు తట్టారు.

కొద్దిసేపటికి అరుపులు ఆగిపోయాయి. నిందితుడు బయటికి వచ్చాడు. అతని చేతిలో రక్తం కారుతున్న కత్తి ఉంది. అతను తలుపులు కొట్టినవారిమీదికి కత్తితో దూసుకెళ్లాడు. చిన్నారిని ఏదో చేశాడని భావించిన స్థానికులు అతనిపై ఎదురు దాడి చేసి కత్తిని తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోకి వెళ్లి చూడగా, వారికిి రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్న చిన్నారి కనిపించింది. ఆమెను మూడుసార్లు కత్తితో పొడిచినట్లు గుర్తించారు. వెంటనే ఆమెను స్కూటర్ పై ఆసుపత్రికి తీసుకెళ్లారు, అయితే ఆస్పత్రికి వెళ్లేలోపే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. దీంతో స్థానికులు యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.

బాలిక మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించిన వైద్యుల్లో ఒకరు మాట్లాడుతూ బాలిక మీద అత్యాచారం జరిగిందా? అనే విషయాన్ని తేల్చడం కోసం స్వాబ్‌ నమూనాలను ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు. "పోస్టుమార్టం ముగిసిన వెంటనే, కొంతమంది వ్యక్తులు ఆమె మృతదేహంతో పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. లాకప్‌లో ఉన్న నిందితుడిపై దాడి చేయాలనే ఉద్దేశ్యంతో వ్యాన్‌ను పీఎస్ లోపలికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి, దాని తర్వాత వారు రాళ్లతో దాడి చేశారు" అని డిసిపి తోలాని అన్నారు.

పోలీస్ స్టేషన్ బయట పార్క్ చేసిన ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ అధికారి కారును స్థానికులు ధ్వంసం చేశారని డిప్యూటీ కమిషనర్ లతా అగర్వాల్ తెలిపారు. నిందితుడి ఇంటి కూల్చివేతను పర్యవేక్షించే పోలీసు, IMC బృందంతో ఉన్న జోనల్ అధికారి కారు అది అని సమాచారం. ఇక దీనిమీద 
నిందితుడి కుటుంబ సభ్యులు మాత్రం అతని మానసిక స్థితి సరిగా లేదని చెప్పడం గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios