రాయ్‌పూర్:ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని తెల్టా గ్రామంలో పేపర్ మిల్లులో క్లీనింగ్ చేస్తున్న సమయంలో గ్యాస్ లీకై ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.

తెల్టా గ్రామంలోని  రాయ్ ఘర్ ప్రాంతంలో పేపర్ మిల్లులో  ఈ ఘటన చోటు చేసుకొందని అధికారులు తెలిపారు.శక్తి పేపర్ మిల్లులో కార్మికులు బుధవారం నాడు రాత్రి ట్యాంక్ క్లీన్ చేశారు. లాక్ డౌన్ కారణంగా ఫ్యాక్టరీని మూసివేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో ఫ్యాక్టరీలో తిరిగి పనులు ప్రారంభించేందుకు సన్నాహలు చేస్తున్నారు.

also read:విశాఖలో గ్యాస్ లీకేజీని సుమోటోగా తీసుకొన్న హైకోర్టు:ప్రభుత్వాలకు నోటీసులు

ఈ సమయంలో స్వల్పంగా గ్యాస్ లీకైంది. వెంటనే స్థానికులు కార్మికులను ఆసుపత్రికి తరలించారు. ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. 

ఫ్యాక్టరీలో విష వాయువు లీకైన కారణంగానే తాము అస్వస్థతకు గురైనట్టుగా చెప్పారు. అయితే కార్మికులు అస్వస్థతకు గురికావడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.