BJP: ఏడుగురు కేంద్రమంత్రులను రాజ్యసభకు తీసుకోవడం లేదు.. బీజేపీలో ఏం జరుగుతున్నది?
రాజ్యసభలో పదవీ కాలం ముగుస్తున్న ఏడుగురు కేంద్రమంత్రులను తిరిగి రాజ్యసభకు తీసుకోవడం లేదు. మొత్తం 28 మంది బీజేపీ నాయకుల పదవీ కాలం ముగుస్తుండగా.. అందులో నలుగురిని మాత్రమే రీనామినేట్ చేస్తుండటం గమనార్హం.
Rajya Sabha: ఏడుగురు కేంద్రమంత్రుల రాజ్యసభ పదవీ కాలం ఏప్రిల్ నెలకు ముగుస్తున్నది. కానీ, వీరిని బీజేపీ మళ్లీ నామినేట్ చేయడం లేదు. దీంతో అసలు బీజేపీలో ఏం జరుగుతున్నది? హైకమాండ్ ఏం ఆలోచిస్తున్నది? అనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే.. ఇలా రాజ్యసభకు రీనామినేట్ చేయని కేంద్రమంత్రులను వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దింపాలని మోడీ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా(గుజరాత్), విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(మధ్యప్రదేశ్), జూనియర్ ఐటీ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్(కర్ణాటక)ల పేర్లు రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో లేవు. వీరితోపాటు పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్(రాజస్తాన్), మత్స్య శాఖ పురుషోత్తం రూపాలా(గుజరాత్), మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ మినిస్టర్ నారాయణ్ రాణే(మహారాష్ట్ర), విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్(కేరళ)ల పేర్లూ లేవు. వీరిని కూడా లోక్ సభ బరిలో నిలిపే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ధర్మేంద్ర ప్రధాన్‌ను సంబల్‌పూర్ లేదా దెక్నాల్ నుంచి, భుపేంద్ర యాదవ్‌ను రాజస్తాన్‌లోని అళ్వార్ లేదా మహేంద్రగడ్ నుంచి, చంద్రశేఖర్‌ను బెంగళూరులోని నాలుగు స్థానాల్లో దేని నుంచి అయినా బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Lovers Temple: పారిపోయి వస్తే పెళ్లి చేసి.. ఆశ్రయం ఇచ్చే ఆలయం.. ఎక్కడుందో తెలుసా?
ఇదే విధంగా మాండవీయాను గుజరాత్‌లోని భావ్‌నగర్, సూరత్ నుంచి, రూపాలాను రాజ్‌కోట్ నుంచి, కేరళ నుంచి మురళీధరన్‌ను పోటీ చేయించాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. కేవలం ఇద్దరు మంత్రులను మాత్రమే మళ్లీ రాజ్యసభకు నామినేట్ చేస్తున్నది. అందులో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, మత్స్య శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్‌లను మళ్లీ రాజ్యసభకు పంపిస్తున్నది. రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు రాజ్యసభ ఎంపీలుగా ఉన్నవారిని ఎవరినీ పెద్దల సభకు పంపిస్తున్నది. జేపీ నడ్డాకు మాత్రమే ఇందుకు మినహాయింపు ఉన్నది. కాగా, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్‌ను రాజ్యసభకు పంపిస్తున్నది.
మొత్తంగా చూసుకుంటే బీజేపీలో సమూల మార్పులు జరుగుతున్నాయి. మొత్తం 28 మంది బీజేపీ నాయకుల రాజ్యసభ పదవీ కాలం ముగుస్తుంటే.. అందులో కేవలం నలుగురిని మాత్రమే రాజ్యసభకు మళ్లీ నామినేట్ చేస్తున్నారు.