ముంబయి విమానాశ్రయంలో సర్వర్ డౌన్ అయింది. దీంతో ప్రయాణికులు బారులు తీరారు. ఎయిర్‌పోర్టులో రద్దీ నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే, తాజాగా, సర్వర్ మళ్లీ పని చేస్తున్నదని ఎయిర్‌పోర్టు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 

ముంబయి: మహారాష్ట్రలో ముంబయి ఎయిర్‌పోర్టులో గురువారం సాయంత్రం సర్వర్ డౌన్ అయింది. దీంతో విమానాల రాకపోకలు ప్రభావితం అయ్యాయి. విమాన ప్రయాణాలు జాప్యం అయ్యాయి. సాధారణం కంటే విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య అధికంగా కనిపించింది. రద్దీగా మారడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, సర్వర్ ఇప్పుడు సరిగా పనిచేస్తున్నదని అధికారులు తెలిపారు. 

సాధారణం కంటే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని, రద్దీగా ఉన్నదని సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. అయితే, గందరగోళం తలెత్తకుండా ప్రయాణికులకు మ్యానువల్ పాస్‌లు జారీ చేసినట్టు వివరించారు.

Scroll to load tweet…

ముంబయి ఎయిర్‌పోర్టులో సిస్టమ్ క్రాష్ అయిందని, క్రౌడ్ పెరిగిపోయిందని, కౌంటర్ల ముందు ప్రయాణికులు బారులు తీరారని ఓ ట్విట్టర్ యూజర్‌ పోస్టు పెట్టారు. అందుకు ఎయిర్ ఇండియా స్పందించింది. ప్రయాణాలు ఆలస్యం కావడం అందరినీ బాధిస్తాయని, ఈ అంతరాయాన్ని వీలైనంత కుదించడానికి తమ బృందం పని చేస్తున్నదని వివరించింది. ఏ అప్‌డేట్ ఉన్నా వారు టచ్‌లోకి వస్తారని తెలిపింది.

Also Read: ముంబయి ఎయిర్ పోర్టులో భారీగా హెరాయిన్ పట్టివేత.. దాని విలువ తెలిస్తే.. దిమ్మతిరగాల్సిందే.

సర్వర్ మళ్లీ రీస్టోర్ అయ్యాక అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ముంబయి ఎయిర్‌పోర్టులో సర్వర్ మళ్లీ రీస్టోర్ అయిందని ఎయిర్‌పోర్టు ఓ ప్రకటనలో వివరించింది. నగరంలో ఒక్కడో పని జరుగుతున్న చోట ఓ కేబుల్ తెగిపోయి ఉంటుందని, అందువల్లే నెట్‌వర్క్ రాలేదని తెలిపింది.