Asianet News TeluguAsianet News Telugu

ముంబయి ఎయిర్ పోర్టులో భారీగా హెరాయిన్ పట్టివేత.. దాని విలువ తెలిస్తే.. దిమ్మతిరగాల్సిందే.

ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో హెరాయిన్ పట్టుబడింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డిఆర్ఐ) అధికారులు నిర్వహించిన తనిఖీల్లో జింబాబ్వే నుంచి వచ్చిన  ప్రయాణికుల నుంచి దాదాపు రూ.50 కోట్ల విలువైన 7.9 కిలోల హెరాయిన్‌ ను స్వాధీనం చేసుకున్నారు 

Two Zimbabweans Arrested With Heroin Worth Rs 50 Cr At Mumbai Airport
Author
First Published Nov 27, 2022, 4:16 PM IST

ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు నిర్వహించిన సోదాల్లో ఇద్దరు జింబాబ్వే దేశీయుల నుంచి  దాదాపు రూ.50 కోట్ల విలువైన 7.9 కిలోల హెరాయిన్‌ ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.ఈ మేరకు ఆదివారం నాడు అధికారులు 
తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా.. DRI ముంబై జోనల్ యూనిట్ అప్రమత్తమైంది. అడిస్ అబాబా (ఇథియోపియా) నుండి ఇండియాకు వస్తున్న ఇద్దరు ప్రయాణీకులను( ఆడ, మగ) దర్యాప్తు చేసినట్టు అధికారులు తెలిపారు. వారి లగేజీని శోధించగా.. ట్రావెల్ బ్యాగ్‌లో లైట్ బ్రౌన్ కలర్ పౌడర్ ఉన్న కొన్ని ప్యాకెట్లను టీమ్ గుర్తించింది. ఆ ప్యాకెట్లను  క్షుణంగా పరిశీలించగా.. అవి హెరాయిన్ ప్యాకెట్లని తెలింది.

ఆ నిషేధిత పదార్థం బరువు 7.9 కిలోలు ఉంటుందనీ, పట్టుబడిన ఆ హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.50 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు తెలిపారు.నిందితులను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేసి ప్రత్యేక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న డ్రగ్ సిండికేట్‌ను ఛేదించేందుకు డీఆర్‌ఐ తదుపరి విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

అంతకు ముందు.. 

శుక్రవారం నాడు నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డిఆర్ఐ) అధికారులు ఎయిర్ పోర్టులో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో నైరోబి నుంచి వచ్చిన ఓ వ్యక్తి తనిఖీ చేయగా.. అతని వద్ద 4.98 కిలోల హెరాయిన్‌ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి.. అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన హెరాయిన్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ.35కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు  అధికారులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios