న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ ధరను  సీరం సంస్థ బుధవారం నాడు ప్రకటించింది.  ఈ ఏడాది మే 1 నుండి  దేశంలోని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ తయారు చేసే సంస్థల ప్రతినిధులతో  రెండు రోజుల క్రితం ప్రధాని మోడీ  చర్చించారు. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాలని కంపెనీలను ప్రధాని కోరారు. ఆయా ఫార్మా కంపెనీలకు కేంద్రం రుణాన్ని కూడ ఇచ్చింది. మే 1వ తేదీ నుండి  మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం ప్రారంభించనుంది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 18 ఏళ్లు నిండినవారికి వ్యాక్సిన్ వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది.

also read:మే నుండి18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్: కేంద్రం సంచలన నిర్ణయం

 

&nb

sp;

 

వ్యాక్సిన్ ఉత్పత్తిని చేసే ఫార్మా కంపెనీలు 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తాయి. మిగిలిన 50 శాతం బహిరంగ మార్కెట్లో విక్రయిస్తాయి. తమకు అవసరమైన వ్యాక్సిన్ ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీల నుండి కొనుగోలు చేసే వెసులుబాటును కేంద్రం ప్రకటించింది.ఈ క్రమంలోనే  మే 1 తేదీలోపుగా వ్యాక్సిన్ ధరలను ప్రకటించాలని కేంద్రం ఫార్మా సంస్థలను కోరాయి.  ఈ మేరకు  బుధవారం నాడు సీరం సంస్థ  వ్యాక్సిన్ ధరను ప్రకటించింది.