లాక్‌డౌన్ ఎఫెక్ట్: తల్లి అంత్యక్రియలకు వెళ్లలేని ఆర్మీ జవాన్, వీడియో చూస్తూ కన్నీళ్లు
లాక్‌డౌన్ నేపథ్యంలో తల్లి అంత్యక్రియలకు హాజరు కాలేని ఓ ఆర్మీ జవాన్ వీడియో కాల్ లో తల్లి మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాథ్యమాల్లో వైరల్ గా మారింది.
చెన్నై:లాక్‌డౌన్ నేపథ్యంలో తల్లి అంత్యక్రియలకు హాజరు కాలేని ఓ ఆర్మీ జవాన్ వీడియో కాల్ లో తల్లి మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాథ్యమాల్లో వైరల్ గా మారింది.
తమిళనాడు రాష్ట్రంలోని 42 ఏళ్ల శక్తివేల్ రాజస్థాన్ రాష్ట్రంలో ఆర్మీలో జవాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని కుటుంబసభ్యులు తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలోని అజంగగౌండనూరులో నివాసం ఉంటారు.
శక్తివేల్ పనిచేస్తున్న ప్రాంతం తన కుటుంబసభ్యులు ఉంటున్న ప్రాంతానికి సుమారు రెండు వేల కి.మీ. దూరంలో ఉంటుంది. శక్తివేల్ తల్లి సుధీర్ఘ అనారోగ్యం కారణంగా ఈ నెల 26వ తేదీన మరణించింది. ఆమె మరణించిన విషయాన్ని తండ్రి ఫోన్ ద్వారా శక్తివేల్ కు చెప్పాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు రావాలని కొడుకును కోరాడు.
లాక్ డౌన్ నేపథ్యంలో తాను స్వంత గ్రామానికి వచ్చి తల్లి అంత్యక్రియలుు నిర్వహించలేనని శక్తివేలు తండ్రికి చెప్పాడు. అంత్యక్రియలను నిర్వహించాలని తండ్రిని కోరాడు.
also read:ఆన్‌లైన్‌లో పెళ్లి: ఫోన్ కు తాళి కట్టిన వరుడు, వీడియో వైరల్...
తన తల్లి చివరి చూపు చూసేందుకుగాను శక్తివేల్ కు వీడియో కాల్ చేశాడు తండ్రి. వీడియో కాల్ లో తల్లి మృతదేహాన్ని చూసిన శక్తివేల్ చిన్న పిల్లాడిగా కన్నీరు మున్నీరుగా విలపించాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.