ఆన్‌లైన్‌లో పెళ్లి: ఫోన్ కు తాళి కట్టిన వరుడు, వీడియో వైరల్
కేరళ రాష్ట్రంలో జరిగిన ఓ పెళ్లి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. లాక్ డౌన్ నేపథ్యంలో జరిగిన ఆన్ లైన్ లో జరిగిన పెళ్లి నెటిజన్లలో చర్చకు దారితీసింది. ఆన్ లైన్ పెళ్లిలో వరుడు ఫోన్ కు తాళి కట్టాడు.
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో జరిగిన ఓ పెళ్లి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. లాక్ డౌన్ నేపథ్యంలో జరిగిన ఆన్ లైన్ లో జరిగిన పెళ్లి నెటిజన్లలో చర్చకు దారితీసింది. ఆన్ లైన్ పెళ్లిలో వరుడు ఫోన్ కు తాళి కట్టాడు.
లాక్ డౌన్ పెళ్లిళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. మరికొందరైతే నిర్ణీత ముహుర్తానికే పెళ్లిళ్లు చేసుకోవాలని పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల సమక్షంలో పెళ్లిళ్లు చేసుకొంటున్నారు.
కేరళ రాష్ట్రంలోని బ్యాంకు ఉద్యోగిగా పనిచేసే శ్రీజిత్ అలప్పుజాకు చెందిన అంజానాకు పెద్దలు పెళ్లి కుదిర్చారు. ఈ నెల 26వ తేదీన వీరి పెళ్లి చేయాలని నిర్ణయించారు.అయితే వధువు మాత్రం కేరళ రాష్ట్రంలో లేదు. ఆమె ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. లక్నోలో పెళ్లి కూతురు అంజనా ఆమె తల్లి, సోదరుడు ఉన్నారు.
ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో నిర్ణీత ముహుర్తానికి పెళ్లి చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయం తీసుకొన్నారు. నిర్ణీత ముహుర్తానికి ముందే వధూవరులు చక్కగా ముస్తాబయ్యారు.
also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: రెండు సార్లు వాయిదా, కలెక్టరేట్‌లో నిరాడంబరంగా పెళ్లి
సెల్‌ఫోన్లలో వీడియో కాల్స్ ద్వారా ఆన్ లైన్ పెళ్లి చేసుకొన్నారు. లక్నోలో ఉన్న వధువు పెళ్లి కూతురుగా ముస్తాబై ఆన్ లైన్ లోకి రాగానే ముహుర్తం సమయంలోనే వరుడు సెల్ ఫోన్ కు తాళి కట్టాడు. సెల్ ఫోన్ వెనుక వైపున తాళిని కట్టాడు. సరిగ్గా అదే సమయంలో వధువు తల్లి అంజనా మెడలో తాళి కట్టింది.
ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత తమ పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయిస్తామని వరుడు శ్రీజిత్ చెప్పారు.