శ్రీనగర్: జమ్మూ కాశ్మీరులోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ సీనియర్ పోలీసాఫీసరు మరణించాడు. మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.

సైన్యం, సిఆర్పీఎఫ్, పోలీసు ఉగ్రవాదులపై సంయుక్త ఆపరేషన్ ను చేపట్టాయి. దక్షిణ కాశ్మీరులోని కుల్గాం జిల్లాలో గల తురిగామ్ ఏరియాలో బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలో భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి.

ఉగ్రవాదుల కాల్పుల్లో డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్ ఆమన్ కుమార్ మరణించారు. ఆయన 2011 బ్యాచ్ ఆఫీసరు. గత రెండేళ్లుగా కుల్గాంలో పనిచేస్తున్నారు.