అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో ఆయన కంటే ఎక్కువగా ఇండియన్ మీడియా దృష్టిలో నిలిచారు ట్రంప్ కుమార్తె ఇవాంక. అందం, చలాకీ తనం కలగలిసిన ట్రంప్ భారతీయ అధికారులతో పాటు అమెరికన్ అధికారులను సమన్వయం చేసుకుంటూ తండ్రి పర్యటనను పర్యవేక్షిస్తున్నారు.

సోమవారం అహ్మాదాబాద్, ఆగ్రా, ఢిల్లీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన ఇవాంక రెండో రోజు సైతం తనదైన శైలిలో వస్త్రధారణ చేశారు. ఉదయం రాష్ట్రపతి భవన్ వద్దకు మెలానియా ట్రంప్‌, తన భర్త జారెద్ కుష్నర్‌తో కలిసి వచ్చారు. ఈసారి పూర్తిగా భారతీయ శైలి కనిపించేలా తెల్లని షెర్వాణీ ధరించారు. దీంతో మీడియా ఇవాంకను టార్గెట్ చేసింది.

Also Read:ఇవాంకా కి ముగ్గురు పిల్లలా...? ఆమె అందం సీక్రెట్ ఇదే..!

ఈ షెర్వాణీని ఇండో వెస్ట్రన్ డిజైనర్ అనితా డొంగ్రే డిజైన్ చేశారు. ముర్షీదాబాద్ పట్టుతో తయారుచేసిన షెర్వాణీని ఆమె అందంగా రూపొందించారు. స్లివ్‌లెస్ కాకుండా, భారతీయత ఉట్టిపడేట్టు ఇంకా అందంగా ఇవాంక కనిపించారు. దీనికి మెటాలిక్ బటన్లను పొందుపరిచారు.

దీనిపై అనితా డోంగ్రే మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లోని ప్రఖ్యాత ముర్షిదాబాద్ పట్టును షెర్వాణీ కోసం ఉపయోగించానని ఆమె తెలిపారు. ఈ పట్టును పురాతన పద్దతుల్లో చేతితో నేశారని అనిత చెప్పారు.

ఇటువంటి షేర్వాణీని తాము రెండు దశాబ్ధాల కిందటే రూపొందించామని, కానీ ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఈ మోడల్ ఇంకా అద్భుతంగా ఉందని అనిత హర్షం వ్యక్తం చేశారు.

Also Read:రెడ్ డ్రెస్‌తో తళుక్కుమన్న ఇవాంకా: ఇది రెండోసారి, కాస్ట్ ఎంతో తెలుసా..?

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన, ప్రభావశీలురైన మహిళలకు అనిత డోంగ్రే బట్టలను డిజైన్ చేస్తుంటారు. గతంలో ఆమె కేట్ మిడిల్‌టన్‌కు, బెల్జియం రాణి మథిదే, ట్రుడేకు చెందిన సోపి గ్రెగోయిర్‌లకు అనిత వస్త్రాలను డిజైన్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్‌కు 2018లో భారత్ వచ్చిన సందర్భంగా బట్టలు రూపొందించారు.