బ్రిటిష్ వారి నుండి భారతదేశానికి అధికార మార్పిడికి చిహ్నంగా నిలిచిన 'సెంగోల్'.. కొత్త పార్లమెంటు భవనంలో వారసత్వంగా ఉంచడానికి.. ఢిల్లీకి చేరుకుంది.
ఉత్తరప్రదేశ్ : అలహాబాద్ మ్యూజియంలో ఉన్న బంగారు 'సెంగోల్' కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి ముందే దేశ రాజధానికి తరలించారు. ముఖ్యంగా, బ్రిటిష్ వారి నుండి భారతదేశానికి అధికార మార్పిడికి చిహ్నంగా నిలిచిన 'సెంగోల్' కొత్త పార్లమెంటు భవనంలో వారసత్వంగా ఉంచబోతున్నారు.
అలహాబాద్ మ్యూజియం క్యూరేటర్, వామన్ వాంఖడే మాట్లాడుతూ, మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు సంబంధించిన సేకరించిన వస్తువులన్నింటినీ అలహాబాద్ మ్యూజియంలో ఉంచామన్నారు. అలా.. అలహాబాద్ మ్యూజియంలో ఉంచిన చారిత్రక 'సెంగోల్' గత సంవత్సరం నేషనల్ మ్యూజియంకు బదిలీ చేయబడిందని చెప్పారు.
కొత్త పార్లమెంట్ భవనంలో తమిళనాడు చారిత్రక రాజదండం ‘సెంగోల్’.. దీని చరిత్ర ఏంటంటే...
వామన్ వాంఖడే ఇంకా మాట్లాడుతూ, "ఈ మ్యూజియం శంకుస్థాపన కూడా మాజీ ప్రధాని నెహ్రూనే చేశారు. అప్పటి క్యూరేటర్ ఎస్ సి కళా ఆధ్వర్యంలో... ఆయన అలహాబాద్ మ్యూజియంకు 1200 కంటే ఎక్కువ వస్తువులను విరాళంగా ఇచ్చారు. నెహ్రూ తన మొత్తం సేకరణ వస్తువులు అలహాబాద్ మ్యూజియంలోనే ఉండాలని కోరుకున్నారు. అలా ఆయనకు చెందిన అన్ని వస్తువులతో పాటు, ఈ బంగారు కర్ర కూడా సేకరణలో ఉంచబడింది.
"సెంగోల్ బంగారు పాలిష్‌తో ఉన్న 162 సెం.మీ పొడవు గల కర్ర. నవంబర్ 4, 2022న దీనిని జాతీయ మ్యూజియంకు బదిలీ చేశారు" అన్నారాయన. అమృత్‌కాల్‌కు జాతీయ చిహ్నంగా సెంగోల్‌ను దత్తత తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. పురోహితులు ఈ వేడుకను పునరావృతం చేయడంతో పాటు ప్రధానమంత్రికి సెంగోల్‌ను ధరింపచేయనున్నారు. పార్లమెంటు కొత్త భవనం కూడా ఈ సంఘటనకు సాక్ష్యమివ్వనుంది.
1947 నాటి అదే సెంగోల్‌ను ప్రధానమంత్రి లోక్‌సభలో స్పీకర్ పోడియంకు దగ్గరగా ఏర్పాటు చేస్తారు. ఇది దేశం చూడటానికి ప్రదర్శించబడుతుంది. ప్రత్యేక సందర్భాలలో బయటకు తీస్తారు.
