MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • కొత్త పార్లమెంట్ భవనంలో తమిళనాడు చారిత్రక రాజదండం ‘సెంగోల్’.. దీని చరిత్ర ఏంటంటే...

కొత్త పార్లమెంట్ భవనంలో తమిళనాడు చారిత్రక రాజదండం ‘సెంగోల్’.. దీని చరిత్ర ఏంటంటే...

కొత్త పార్లమెంట్ లో మరో సరికొత్త ప్రత్యేకత ఉండబోతోంది. సెంగోయ్ అయే రాజదండాన్ని స్పీకర్ కుర్చీ పక్కనే అమర్చనున్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే..

2 Min read
Author : Bukka Sumabala
Published : May 24 2023, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Sengol

Sengol

ఢిల్లీ : కొత్త పార్లమెంట్ భవనం ఆదివారం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీనిమీద అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య  చిన్నపాటి ఘర్షణ కొనసాగుతోంది. అదలా ఉంచితే.. ఈ పార్లమెంటు కొత్త భవనం మరో కొత్త ప్రత్యేకతను సంతరించుకోనుంది. పార్లమెంటు భవనంలో రాజదండం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆదివారం నాడు ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ స్పీకర్ కుర్చీ సమీపంలో ఒక బంగారు రాజ దండాన్ని ఆవిష్కరించబోతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బుధవారం నాడు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ రాజదండం కున్న చారిత్రక ప్రాధాన్యతను కూడా అమిత్ షా తెలిపారు. భారతీయులకు, బ్రిటిష్ వారికి మధ్య జరిగిన అధికార మార్పిడికి ఆ రాజదండమే నిదర్శనమని గుర్తు చేశారు. స్వతంత్ర భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ ఈ రాజదండం అందించారని తెలిపారు. ఈ రాజదండాన్ని సెంగోల్ అని పిలుస్తారని..  ఇది తమిళ పదం అయినా సెమ్మాయ్ (ధర్మం) నుంచి వచ్చిందని వెల్లడించారు. 

37

ఈ రాజదండం గురించి…
ఈ రాజదండం ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితుల గురించి  తెలుసుకుంటే… ఆంగ్లేయుల పాలన ముగిసిపోయి భారత్ కు స్వాతంత్రం ప్రకటించే ముందు మౌంట్ బాటెన్, నెహ్రూల మధ్య ఓ చర్చ జరిగింది. ఆ చర్చే ఈ రాజదండం ఏర్పాటుకు దారితీసింది. ఆ చర్చలో మౌంట్ బాటెన్.. నెహ్రూతో మాట్లాడుతూ.. బ్రిటిషర్లనుంచి నుంచి భారతీయులకు అధికార బదిలీ జరిగిందని చెప్పడానికి గుర్తుగా  ఏం చేద్దామని ప్రశ్నించారట.

47
Sengol

Sengol

ఆ ప్రశ్న విన్న తర్వాత నెహ్రూ.. తనతో పాటు తన పక్కనే ఉన్న స్వతంత్ర భారతదేశపు మొదటి, చివరి భారతీయ గవర్నర్ జనరల్ రాజగోపాలాచారిని సలహా అడిగారట. దానికి రాజాజీ తమిళ సంప్రదాయంలో ఉన్న ఒక విధానాన్నినెహ్రూకు వివరించారు.  ఏ దేశానికైనా కొత్త రాజుగా పదవీ బాధ్యతలు చేపట్టే సమయంలో ప్రధాన పూజారి ఒ రాజదండం ఆయనకు అందజేసే సంప్రదాయం ఉందని చెప్పుకొచ్చారు. చోళులు ఈ సంప్రదాయాన్ని అనుసరించారని తెలిపారట. దీంతో అలాంటి రాజదండం తయారు చేసే పనిని రాజాజీకి.. నెహ్రూ అప్పగించారట.

57

ఈ మేరకు రాజగోపాలాచారి ప్రస్తుత తమిళనాడులోని ప్రఖ్యాత మఠమైన తిరువడుత్తురై అథీనంను సంప్రదించారు. రాజాజీ చెప్పినదంతా విన్న తర్వాత అక్కడి మఠాధిపతులు రాజదండం తయారీలో సహకరించేందుకు అంగీకరించారు. మద్రాస్ లోని ఓ స్వర్ణకారుడి చేత ఆ రాజదండాన్ని తయారు చేయించారు. ఈ రాజదండం పొడుగు 5 అడుగులు. పై భాగంలో నంది గుర్తును ఏర్పాటు చేశారు. 

67

ఈ నంది గుర్తు న్యాయానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. దీని తయారీ పూర్తయిన తర్వాత ఆ మఠానికి చెందిన స్వామీజీ ఒకరు ఆ దండాన్ని మొదట లార్డ్ మౌంట్ బాటెన్ కు అందించారు. ఆ తర్వాత అతడి నుంచి దానిని వెనక్కి తిరిగి తీసుకుని.. గంగాజలంతో శుద్ధి చేశారు. ఆ తర్వాత ఆ రాజదండంను నెహ్రూ దగ్గరికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. భారతదేశానికి అర్ధరాత్రి స్వతంత్ర ప్రకటన చేయడానికి పావుగంట ముందు దానిని భారత నూతన ప్రధానికి అందజేశారు.  

77

ఇక ఈ ప్రక్రియ జరుగుతున్నంత సేపు దీని కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాటను పాడారట. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఈ రాజదండంకు సంబంధించిన ప్రాధాన్యత కానీ.. చరిత్ర కానీ చాలామందికి తెలియదని అమిత్ షా అన్నారు. కొత్త పార్లమెంట్లో ప్రస్తుతం ఈ రాజదండం ఏర్పాటు వల్ల..  మన సంప్రదాయాలను ఆధునికతను సంధానించే ప్రయత్నం జరుగుతుందన్నారు.  

ఇలా చేయాలనడం మోదీ దూరదృష్టికి నిదర్శనమని కొనియాడారు.  ఈ రాజ దండం ప్రస్తుతం అలహాబాద్ లోని మ్యూజియంలో ఉంది.  ఆదివారం పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో భాగంగా దీనిని పార్లమెంట్ భవనంలో అమర్చనున్నారు.
 

About the Author

BS
Bukka Sumabala
అమిత్ షా

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Recommended image2
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?
Recommended image3
Now Playing
CM Vijay First Independence Day | సీఎం హోదాలో తొలిసారి జెండా ఎగరేసిన విజయ్| FlagHoisting | TamilNadu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved