Asianet News TeluguAsianet News Telugu

Nithyananda: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి నిత్యానందను ఆహ్వానించారా?.. ‘ఆహ్వానం అందింది’

అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి నిత్యానందకు కూడా ఆహ్వానం పంపారా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతున్నది. తనకు ఆహ్వానం అందినట్టు నిత్యానంద స్వయంగా ఎక్స్‌లో పేర్కొన్నాడు.
 

self claimed god nithyananda says he was formally invited for consecration ceremony in ayodhya kms
Author
First Published Jan 22, 2024, 2:14 AM IST

Nithyananda: అయోధ్యలోని రామ మందిరంలో 22వ తేదీన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకు అయోధ్య సర్వం సిద్దమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం దేశంలోని చాలా మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఇదే నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చర్చను లేవదీశాయి. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న, విదేశాలకు పారిపోయిన నిత్యానందకు కూడా ఆహ్వానం అందిందా? అనే చర్చ జరిగింది. ఇందుకు నిత్యానంద చేసిన ట్వీట్ కారణంగా ఉన్నది.

ఎక్స్ (ట్విట్టర్)లో నిత్యానంద తనకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందినట్టు పేర్కొన్నాడు. చారిత్రక, అసాధారణ కార్యక్రమం ఇది అని తెలిపాడు. తనకు ఈ కార్యక్రమం కోసం గౌరవపూర్వక ఆహ్వానం అందిందని పేర్కొన్నాడు. అంతేకాదు, ఆ రోజు ఆయన చెప్పే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసాలో ఏయే కార్యక్రమాలు ఉంటాయో అన్నీ ఏకరువు పెట్టాడు.

Also Read : Raja Singh: లోక్ సభ ఎన్నికల్లో రాజాసింగ్ ఆసక్తి.. హైదరాబాద్ సీటు వద్దని.. అక్కడి నుంచి పోటీకి సై

అయితే, నిజంగానే ఆయనకు ఆహ్వానం పంపించారా? అనే విషయంపై స్పష్టత లేదు. నిత్యానంద మాత్రమే తనకు ఆహ్వానం అందిందని పేర్కొన్నాడు. కానీ, రామ మందిర ప్రతినిధులు మాత్రం ఎలాంటి ప్రకటన వెలువరించలేదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios