స్కూల్ పుస్తకాల్లో ఇదేం చెత్త: మండిపడిన సెహ్వాగ్

Sehwag Lambastes Content on School Textbooks
Highlights

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వ్యవహరిస్తాడు. ఆయన చేసే ట్వీట్లు ప్రత్యేకంగా ఉంటాయి. వివిధ అంశాలపై ఆయన తనదైన శైలిలో స్పందిస్తుంటాడు.

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వ్యవహరిస్తాడు. ఆయన చేసే ట్వీట్లు ప్రత్యేకంగా ఉంటాయి. వివిధ అంశాలపై ఆయన తనదైన శైలిలో స్పందిస్తుంటాడు.

తాజాగా చిన్నారులు చదువుకొనే పాఠ్యపుస్తకాల్లో ముద్రించిన ఓ అంశంపై సెహ్వాగ్ తీవ్రంగా మండిపడ్డాడు. ఈ పాఠ్యపుస్తకంలో పెద్ద కుటుంబానికి సంబంధించిన విషయాన్ని ప్రచురించారు. ఇందులో "పెద్ద కుటుంబం అంటే తల్లిదండ్రులు, తాత-బామ్మలు, ఇంకా చాలా మంది పిల్లలు ఉంటారు. ఒక పెద్ద కుటుంబ సభ్యులు తమ జీవితాన్ని ఆనందంగా సాగించలేరు" అని ఉంది. 

దానిపైనే సెహ్వాగ్ తీవ్రంగా మండిపడ్డాడు. "పాఠ్య పుస్తకాల్లో ఇటువంటి చెత్త  ఏమిటి. ఇది చూస్తుంటే అధికారులు  కంటెంట్‌ని రెండోసారి పరిశీలించకుండానే పుస్తకాల్లో ప్రచురిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది" అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. 

 

loader