Asianet News TeluguAsianet News Telugu

విచిత్రం.. అక్కడ ఎటు చూసినా ద్రౌపదులే.. ఒక్కొక్క మహిళకు ఐదుగురు, అంతకుమించి భర్తలు...ఎక్కడంటే..

హిమాచల్ ప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో మహిళలు ఒకరికంటే ఎక్కువమంది పురుషులను పెళ్లి చేసుకునే సంప్రదాయం కొనసాగుతోంది. అది కూడా ఒకే ఇంట్లోని పురుషులందరినీ ఒకే మహిళ వివాహం చేసుకుంటుంది. 

Draupadi tradition continues even today in Himachal Pradesh
Author
First Published Dec 5, 2022, 8:40 AM IST

హిమాచల్ ప్రదేశ్ : ద్రౌపది..  ఈ పేరు వినగానే  మహా భారతకాలం.. పాండవులు, ఆ ఐదుగురు భర్తల ఇల్లాలిగా అనేక విషయాలు గుర్తుకు వస్తాయి. పురాణాల గురించి పెద్దగా తెలియని వారికి కూడా.. ద్రౌపది అంటే ఐదుగురు భర్తల ఇల్లాలు అనే విషయం తెలిసి ఉంటుంది, అయితే, ఇది మహాభారత కాలానికే పరిమితం కాలేదు. ఆ సంప్రదాయం అక్కడితో ఆగిపోలేదు. భారత్ లోని ఓ రాష్ట్రంలో ఇప్పటికీ  కొనసాగుతోంది.ఈ పద్ధతి ఇప్పటికీ అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా  కొనసాగుతోంది. అదెక్కడా అని ఆశ్చర్యపోతున్నారా? హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో. ఇక్కడి కొన్ని తెగల్లో ‘ద్రౌపది సంప్రదాయం’ చాలా ప్రసిద్ధి. 

ఈ ప్రాంతంలోని చాలా మంది మహిళలు ఒకే ఇంట్లోని సోదరులందరినీ వివాహం చేసుకుంటారు. ఐదుగురు, అంతకు మించి ఎక్కువమంది ఉన్నా కూడా.. వారందరినీ ఒకే మహిళ వివాహం చేసుకుంటుంది. వీరంతా ఎలాంటి గొడవలు లేకుండా  సంతోషంగా జీవిస్తారు కూడా. హిమాచల్ ప్రదేశ్ లోని  ఈ ప్రాంతంలో బహు భర్తృత్వం సామాజిక మైనదిగా గుర్తింపు పొందింది. బహు భర్తృత్వం అంటే ఒక స్త్రీ అనేక మంది సోదరులను వివాహం చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న గిరిజన ప్రాంతాలలో ఈ సంప్రదాయం నేటికీ  ఆచరణలో ఉంది. 

కూల్ డ్రింక్ లో సైనెడ్ కలిపి భర్త హత్య.. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భార్య ఘాతుకం..

ఇక్కడి గిరిజన ప్రాంతాలలో చాలామంది స్త్రీలు ఐదుగురు లేదా ఏడుగురు పురుషులను వివాహం చేసుకుంటారు. హిమాచల్ ప్రదేశ్ పర్యాటకానికి కాకుండా సంస్కృతికి కూడా పుట్టినిల్లుగా చెబుతుంటారు. హిమాచల్ లోని కిన్నౌర్ జిల్లా ప్రజలు మహాభారతంలో పాండవ వనవాస కాలం నుండి ఈ ఆచారం ఇక్కడ కొనసాగుతుందని తెలిపారు. పాండవులు వనవాసం సమయంలో ఇక్కడ కాలం గడిపారని వీరు చెబుతారు. అప్పటినుంచి ఇక్కడి ప్రజలు వారినే అనుసరిస్తారు. 

అందుకే తమ ఇంట్లోనే అమ్మాయికి వివాహం నిశ్చయించినప్పుడు ఆమె కుటుంబ సభ్యులు.. పిల్లను ఇవ్వబోయే ఇంట్లోని అబ్బాయిలందరి గురించిన సమాచారాన్ని తెలుసుకుంటారు. తరవాత అమ్మాయికి ఆ ఇంట్లోని సోదరులందరితో వివాహం చేస్తారు. అయితే,  ఐదుగురు అంతకుమించిన వ్యక్తులను పెళ్లి చేసుకున్నా.. ఏ రోజూ వీరి కాపురంలో కలతలు రావట. దీనికి కారణం తరతరాలుగా వస్తున్న ఒక సంప్రదాయమే. 

పెళ్ళిళ్ళు అయ్యాక ఒక సోదరుడు వధువుతో గదిలో ఉంటే అతను తన టోపీని తలుపు వద్ద పెడతాడు. మిగిలిన సోదరులు అది చూసి ఎవరు కూడా వారిద్దరి ఏకాంతానికి భంగం కలిగించరు.  గదిలోకి వెళ్లారు. ఈ పద్ధతి కారణంగానే వారి వైవాహిక జీవితం  ప్రశాంతంగా సాగిపోతుంది. ఒత్తిడి ఉండదు.అంతేకాదు ఈ సంప్రదాయం కారణంగా కుటుంబ ఆస్తి కూడా విభజన జరగదు. కిన్నౌర్ జిల్లాలో మాతృస్వామ్య వ్యవస్థ కొనసాగుతోంది. ఈ జిల్లా పర్యాటకానికి చాలా ప్రసిద్ధి చెందింది.

Follow Us:
Download App:
  • android
  • ios