రెండు సంవత్సరాల క్రితం హర్యానాలో కలకలం రేపిన జంట హత్య కేసులో తుది తీర్పును తాజాగా వెలువరించారు. హర్యానాలోని గురుగావ్ పట్టణంలో ఓ న్యాయమూర్తి భార్య, కుమారుడిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన వ్యక్తిని దోషిగా న్యాయస్థానం తేల్చింది. దోషికి ఉరిశిక్ష వేయాల్సిందిగా తీర్పు వెలువరించింది.

Also Read లోకల్‌ ట్రైన్‌లో యువకుడితో పరిచయం, లైంగిక సంబంధం: వృద్ధుడి దారుణహత్య...

గురుగావ్లో సెషన్స్ జడ్జి భార్య రీతూ, వారి  కుమారుడు ధ్రువ్ ని వ్యక్తిగత భద్రతా సిబ్బంది 2018లో కాల్చిచంపాడు. ఈ ఘటనలో జడ్జి భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అతని కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కాగా... ఈ జంట హత్యలు చేసిన వ్యక్తిగత సిబ్బంది అప్పుడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కానిస్టేబుల్ మహిపాల్ సింగ్ జడ్జి కుటుంబానికి వ్యక్తిగత సిబ్బందిగా నియమించారు. అయితే.. తన వద్ద ఉన్న తుపాకీతో 2018లో వారిని మహిపాల్ హత్య చేశాడు. వాళ్లిద్దరూ రాక్షసులు అని అందుకే చంపేశానంటూ అతను చెప్పడం గమనార్హం. జడ్జి కుటుంబం తన పట్ల చాలా నీచంగా ప్రవర్తించేవారి ఆ కోపంతోనే  చంపేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు.  కాగా... ఈ కేసు తుది విచారణ తాజాగా కోర్టు ముందుకు రాగా.. నిందితుడు మహిషాల్ సింగ్ ని దోషిగా నిర్దారించారు. అతను చేసిన హత్యలకు గాను... మహిపాల్ కి ఉరిశిక్ష విధిచాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది.