స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డ ఓ వ్యక్తి తనను భాగస్వామి నిర్లక్ష్యం చేస్తున్నాడనే కోపంతో అతనిని దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని దొంబివ్లి సమీపంలోని రైల్వే పట్టాల వద్ద ఓ సూట్ కేసు అనుమానాస్పదంగా పడివుంది.

Also Read:కుమార్తెతో తల్లి స్వలింగ సంప్కరం

దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న ఖాకీలు తెరిచిచూడగా.. అందులో ఓ 57 ఏళ్ల వ్యక్తి మృతదేహం వుంది. కేసు దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు మృతుడిని ఉమేశ్ పాటిల్‌గా గుర్తించారు.

అనంతరం స్వలింగ సంపర్కంలో భాగస్వామిగా ఉన్న 27 ఏళ్ల ప్రపుల్ పవార్ అతనిని హత్య చేసినట్లుగా తేల్చారు. నవీ ముంబైలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న పాటిల్‌కు ప్రపుల్ పటేల్‌తో లోకల్ ట్రైన్‌లో పరిచయం ఏర్పడింది. ఇది చివరికి స్వలింగ సంపర్కానికి దారి తీసింది.

Also Read:షాకింగ్ న్యూస్.. శృంగారం వల్ల వ్యక్తికి డెంగీ ఫీవర్

అయితే ఇటీవల ప్రపుల్‌కు కుటుంబసభ్యులు పెళ్లి సంబంధం చూశారు. తనను ప్రపుల్ నిలదీస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన పాటిల్ రెండు రోజుల కిందట అతని ఇంటికి వెళ్లి ఈ విషయంపై నిలదీయడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఊహించని పరిణామంతో ఆగ్రహానికి గురైన పవార్.. పాటిల్‌ను హతమార్చి మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి బొంబివ్లి సమీపంలోని రైల్వే ట్రాకులపై పడేసి పారిపోయాడు.