Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీకి భద్రత పెంచిన ఢిల్లీ పోలీసులు

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో మంగళవారం నాడు జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ ఫారూఖ్ అబ్దుల్లా పాల్గొన్నారు. కాగా, ఈ యాత్రలో కొంత దూరం పాటు రాహుల్‭తో ఫారూఖ్ కలిసి నడిచారు. యాత్రలోకి ప్రవేశించగానే కౌగిళించుకుని స్వాగతం పలికారు రాహుల్. ప్రియాంక గాంధీ వాద్రా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. 

Security Increased For Yatra In Delhi After Congress Alleges
Author
First Published Jan 3, 2023, 10:59 PM IST

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో సాగుతుంది. అనంతరం దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించనున్నది. ఈ క్రమంలో ఢిల్లీలో యాత్ర కొనసాగే ప్రాంతాలైన  కశ్మీర్ గేట్ నుండి ఘజియాబాద్‌లోని లోని వరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. యాత్రలో పాల్గొనే వారు సజావుగా సాగేందుకు వీలుగా పోలీసు సిబ్బందిని పెద్దఎత్తున మోహరించి పలు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో యాత్ర మొదటి విడత తర్వాత.. కాంగ్రెస్ మార్చ్ సమయంలో "భద్రతా ఉల్లంఘనలు" అని ఆరోపించింది. రాహుల్ గాంధీకి భద్రత కల్పించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే.. నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ అధికారులు చెప్పారు,

అయితే రాహుల్ గాంధీ 2020 నుంచి ఇప్పటివరకు మొత్తం 113 సార్లు భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించారని,   మంగళవారం గాంధీకి భద్రతను పెంచినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ వ్యక్తిని భద్రతా వలయంలోకి అనుమతించలేదని, అతను కూడా బయటికి వెళ్లడానికి అనుమతించలేదని వారు తెలిపారు. జెండా అప్పగింత కార్యక్రమం జరిగిన లోనీ సమీపంలోని ఉత్తరప్రదేశ్ సరిహద్దు వద్ద కూడా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ వైపు యాత్ర సాగిన లోనీ రౌండ్‌అబౌట్ వద్ద పోలీసు సిబ్బందిని మోహరించారు. అంతకుముందు.. కాంగ్రెస్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు అనిల్ చౌదరి కశ్మీర్ గేట్ సమీపంలోని హనుమాన్ మందిర్ నుండి ఘజియాబాద్ లోనికి వెళ్లే మార్గాలను పరిశీలించారు.

మరోవైపు.. జోడో యాత్ర మంగళవారం యూపీలోని బాగ్‌పత్‌లోకి ప్రవేశించింది. యూపీలో రాహుల్ గాంధీ తొలిరోజు పర్యటన ముగించుకుని దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఈ యాత్ర ఢిల్లీ కాశ్మీర్ గేట్ మీదుగా యూపీలోని ఘజియాబాద్ చేరుకుని అక్కడి నుంచి బాగ్‌పత్‌కు చేరుకుంది. రాహుల్ గాంధీ పర్యటనకు ముందు ఢిల్లీలోని మార్ఘాట్ హనుమాన్ ఆలయాన్ని కూడా సందర్శించి పూజలు చేశారు. అదే సమయంలో సోదరి ప్రియాంక గాంధీ వాద్రా యూపీలో రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేదికపై నుంచి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ మా అన్నయ్యను చూసి గర్వపడుతున్నాను. వారిపై ఏజెన్సీలు విధించారు కానీ వారు భయపడలేదు' అని ప్రియాంక అన్నారు. నా సోదరుడిని కొనలేకపోయాను . ఎప్పటికీ కొనలేను. నా సోదరుడు యోధుడివి అని ప్రియాంక గాంధీ ప్రశంసించారు.  


తొలిరోజు పర్యటనలో రాజకీయ పలువురు కూడా చేరారు. ఈ యాత్రలో యాత్రలో జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ ఫారూఖ్ అబ్దుల్లా పాల్గొన్నారు. మంగళవారం ఈ యాత్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించిన సందర్భంలోనే ఫారూఖ్ పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ యాత్రలోరాహుల్‭తో ఫారూఖ్ కాసేపు కలిసి నడిచారు. యాత్రలోకి ప్రవేశించగానే కౌగిళించుకుని స్వాగతం పలికారు రాహుల్. ప్రియాంక గాంధీ వాద్రా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. ఫారూఖ్ అబ్దుల్లాను రాహుల్, ప్రియాంక లు కౌగిలించుకుని భావోద్వేగానికి గురయ్యారు.

ఈ యాత్రలో కాంగ్రెస్ నేతలు గౌరవ్ గొగోయ్, అంబికా సోనీ, శివసేనకు చెందిన ప్రియాంక చతుర్వేది కూడా కనిపించారు. వీరితో పాటు రా మాజీ సెక్రటరీ ఏఎస్ దులత్ కూడా రాహుల్ గాంధీతో కరచాలనం చేస్తూ కనిపించారు. తన పర్యటనలో రాహుల్ గాంధీ అన్ని వయసుల వారితో సమావేశమై మాట్లాడుతున్నారు. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సహా పలువురు విపక్ష నేతలు భారత్ జోడో యాత్రకు సంఘీభావం పలుకుతున్నారు. వాస్తవానికి.. ఉత్తరప్రదేశ్ లో సాగే యాత్రలో పాల్గొనాల్సిందిగా బీఎస్పీ సుప్రెమో మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‫‭లకు రాహుల్ లేఖ ద్వారా ఆహ్వానించారు.కానీ,వారు సముఖంగా స్పందించలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios